
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం
కేంద్ర బడ్జెట్ 2024ను పార్లమెంట్‌లో సమర్పించిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరుల సమావేశంలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ప్రభుత్వ రంగ సంస్థల డివిడెండ్లు మెరుగుపడుతున్నాయి. దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5% పన్నుపై చాలా చర్చలు జరిగాయి. నిజానికి సగటు పన్ను కంటే చాలా తగ్గించాం. పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు దీన్ని ప్రవేశపెట్టాం. ప్రభుత్వ సంస్థల వాల్యూయేషన్లు పెరిగాయి. వాటి పనితీరు చాలా మెరుగుపడింది. ఆదాయ సమీకరణకు కేవలం పన్నులు విధించడమే మార్గం కాదు. పన్నేతర మార్గాలు చాలా ఉన్నాయి. ఈ మార్గాల్లో ప్రభుత్వానికి గత మూడేళ్లుగా ఆదాయం సమకూరుతోంది’ అన్నారు.
కేంద్ర బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాల కోసం క్లిక్ చేయండి
ప్రభుత్వ సంస్థల ఆస్తులను విక్రయిస్తున్నారనే ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిస్తూ..‘ఇది ఆస్తులను విక్రయించడం కాదు. వాడకంలోలేని ప్రభుత్వ సంస్థలకు చెందిన ప్రదేశాలు, భవనాలు, స్టేడియంలను మరిన్ని ప్రయోజనాల కోసం ఉపయోగించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది’ అన్నారు.
#WATCH | #UnionBudget2024 | On changes in tax slab and other changes, Union Finance Minister Nirmala Sitharaman says, "It is not just because we have mentioned it in this budget but the attempt to widen the tax net is something which we have been repeatedly saying, that India's… pic.twitter.com/xrCO7EQD6b
— ANI (@ANI) July 23, 2024
Comments
Please login to add a commentAdd a comment