ఢిల్లీ, సాక్షి: ఇండియా అతి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిరనుందని.. ఈ తరుణంలో తాజా బడ్జెట్‌తో ఖర్చుకు ఆదాయానికి మధ్య బ్యాలెన్స్ చేశారని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్(మధ్యంతర)పై ప్రశంసలు గుప్పించిన ఆయన.. దీర్ఘకాలిక లక్ష్యంతోనే దీనిని ప్రవేశపెట్టినట్లు అభిప్రాయపడ్డారు.
‘‘ఇది ఎన్నికల బడ్జెట్ కాదు. ఎన్నికల కోసం కాకుండా, లాంగ్ టర్మ్ తో బడ్జెట్ పెట్టారు. పన్నుల విధానాన్ని మార్చలేదు. ద్రవ్యోల్బణం నియంత్రణలో వ్యక్తిగత పన్నులు, కార్పొరేట్ పన్నులు మార్చలేదు. రూఫ్ టాప్ సోలార్ తో నెట్ జీరో దిశగా ఈ పథకం తీసుకొచ్చారు. ప్రతి ఇంటి పైకప్పు పైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా, దానిపై ఆదాయం పొందేలా పథకం తీసుకురావడం బాగుంది. గ్రీన్ ఎనర్జీ కోసం దేశంలోని ప్రతీ కుటుంబం తమ వంతు భాగస్వామ్యం తీసుకోవాలి..
.. నేషన్ ఫస్ట్, బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ అనే విజన్ తో వెళ్లారు. దీర్ఘకాలంలో ఆస్తుల సృష్టిపై దృష్టి పెట్టారు. ద్రవ్యోల్బణం , లోటు నియంత్రణపై ప్రధానంగా దృష్టి సారించారు. పదేళ్ల కిందటకి, ఇప్పటి ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రం విడుదల చేయడం మంచిదే. మంచి పాలసీలు రూపొందించారు. అనవసరంగా ప్రభుత్వం జోక్యం లేకుండా చేశారు. అందరిలో నమ్మకాన్ని కల్పించారు
.. రెంటల్ హౌసింగ్ స్కీమ్ తో వర్కర్స్ కు శాశ్వత గృహాలు లభ్యమవుతాయి. శ్రామికుల పరిణామాలు పెరుగుతాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు నీతి ఆయోగ్ ద్వారా మంచి కసరత్తు చేశారు. వికసిత భారత్ దిశగా అడుగులు వేసేందుకు ఈ బడ్జెట్ కచ్చితంగా ఉపయోగపడుతుంది’’ అని ఎంపీ అయోధ్య రామిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment