ayodhya rami reddy
-
జగన్ లో నాకు అదే నచ్చింది.. నేను పార్టీ మారను
-
2014లో చంద్రబాబు తెచ్చిన జీవో ప్రకారమే పార్టీ ఆఫీసుల నిర్మాణం
-
మంగళగిరిలో టీడీపీ హత్యా రాజకీయాలు
-
ఇది ఎన్నికల బడ్జెట్ కాదు: వైఎస్సార్సీపీ ఎంపీ ప్రశంస
ఢిల్లీ, సాక్షి: ఇండియా అతి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిరనుందని.. ఈ తరుణంలో తాజా బడ్జెట్‌తో ఖర్చుకు ఆదాయానికి మధ్య బ్యాలెన్స్ చేశారని వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్(మధ్యంతర)పై ప్రశంసలు గుప్పించిన ఆయన.. దీర్ఘకాలిక లక్ష్యంతోనే దీనిని ప్రవేశపెట్టినట్లు అభిప్రాయపడ్డారు. ‘‘ఇది ఎన్నికల బడ్జెట్ కాదు. ఎన్నికల కోసం కాకుండా, లాంగ్ టర్మ్ తో బడ్జెట్ పెట్టారు. పన్నుల విధానాన్ని మార్చలేదు. ద్రవ్యోల్బణం నియంత్రణలో వ్యక్తిగత పన్నులు, కార్పొరేట్ పన్నులు మార్చలేదు. రూఫ్ టాప్ సోలార్ తో నెట్ జీరో దిశగా ఈ పథకం తీసుకొచ్చారు. ప్రతి ఇంటి పైకప్పు పైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా, దానిపై ఆదాయం పొందేలా పథకం తీసుకురావడం బాగుంది. గ్రీన్ ఎనర్జీ కోసం దేశంలోని ప్రతీ కుటుంబం తమ వంతు భాగస్వామ్యం తీసుకోవాలి.. .. నేషన్ ఫస్ట్, బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ అనే విజన్ తో వెళ్లారు. దీర్ఘకాలంలో ఆస్తుల సృష్టిపై దృష్టి పెట్టారు. ద్రవ్యోల్బణం , లోటు నియంత్రణపై ప్రధానంగా దృష్టి సారించారు. పదేళ్ల కిందటకి, ఇప్పటి ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రం విడుదల చేయడం మంచిదే. మంచి పాలసీలు రూపొందించారు. అనవసరంగా ప్రభుత్వం జోక్యం లేకుండా చేశారు. అందరిలో నమ్మకాన్ని కల్పించారు .. రెంటల్ హౌసింగ్ స్కీమ్ తో వర్కర్స్ కు శాశ్వత గృహాలు లభ్యమవుతాయి. శ్రామికుల పరిణామాలు పెరుగుతాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు నీతి ఆయోగ్ ద్వారా మంచి కసరత్తు చేశారు. వికసిత భారత్ దిశగా అడుగులు వేసేందుకు ఈ బడ్జెట్ కచ్చితంగా ఉపయోగపడుతుంది’’ అని ఎంపీ అయోధ్య రామిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. -
దేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమం జరగలేదు..
-
మహారాష్ట్రలో భారీ వర్షాల వల్లే గోదావరికి వరదలు: ఎంపీ వంగా గీత
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ఫిషింగ్ హార్బర్ల ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంగా గీత కోరారు. ఈ మేరకు రెండో రోజు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీ వంగా గీత మీడియాతో మాట్లాడారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని తెలిపారు. అన్నవరం నుంచి జీఎంఆర్ఎస్ఈజడ్ వరకు ప్రత్యేక రైల్వే లైన్ వేయాలని సూచించారు. విభజన చట్టంలో ఉన్న అంశాలతో పాటు ఇతర అభివృద్దికి కేంద్రం సహకరించాలని కోరారు. మహారాష్ట్రలో భారీ వర్షాల వల్లే గోదావరికి వరదలు వచ్చాయని ఎంపీ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం వల్ల భద్రాచాలం మునిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. బ్లూ ఎకానమీ దిశగా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే నడుస్తోందని వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టని, కేంద్రం నిధులు సమకూరుస్తోందని పేర్కొన్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు చేయడానికి వీలు లేదని, డిజైన్లలో కరెక్షన్లపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. బ్లూ ఎకానమీ దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణమే అత్యంత ముఖ్యమని, జీవనోపాధి పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. రూ. 20వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతుందన్న ఎంపీ.. రాష్ట్ర ప్రభుత్వం 10 వేల కోట్ల ఖర్చుతో రహదారులు వేస్తోందని తెలిపారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కావాల్సిన అనుమతుల కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాంమని, ఇప్పటికే మూడు మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. రామాయపట్నం పోర్ట్ శంకుస్థాపన రామాయపట్నం పోర్ట్ పనులకు బుధవారం శంకుస్థాపన చేయనున్నట్లు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఈ పోర్ట్ నిర్మిస్తోందన్నారు. రామాయపట్నం పోర్టును కేంద్రమే నిర్మించాలని కోరినట్లు గుర్తు చేశారు. అయిదు వేల కోట్ల రూపాయలతో పోర్ట్ నిర్మాణం జరగనుందన్నారు. ఇప్పటికే పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయని, దీని వల్ల నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల అభివృద్ధి జరుగుతందని ఆశాభావం వ్యక్తం చేశారు. మచిలీపట్నం పోర్ట్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం
-
వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు. అనంతరం ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా మరో సభ్యుడు పరిమళ్ నత్వానీ వ్యక్తిగత కారణాలతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మరోరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇక 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిలో చాలామంది ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. -
నేడు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, అయోధ్య రామిరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో సభ్యుడు పరిమళ్ నత్వానీ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నారని, మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిలో చాలామంది నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు సామాజిక దూరం పాటించాల్సి ఉన్నందున సభలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
‘ రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తోంది’
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను నియమించిన ప్రక్రియ రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తోందని వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ అన్నారు. బుధవారం వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానిలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభ అభ్యర్థులకు సీఎం జగన్ పార్టీ బీ-ఫామ్‌ను అందించారు. అనంతరం నలుగురు అభ్యర్థులు అసెంబ్లీకి బయల్దేరి వెళ్లి రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. అనంతరం మోపిదేవి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ బీసీలకు గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రెండు స్థానాలు బీసీలకు.. రాష్ట్ర అభివృద్ధి కోసం నత్వానికి.. పారిశ్రామిక అభివృద్ధి కోసం అయోధ్య రామిరెడ్డికి సీటు ఇచ్చారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. నాయకులను చంద్రబాబు నాయుడులా వాడుకొని వదిలేయడం సీఎం జగన్‌కు తెలియదు. చంద్రబాబు నాయకులను కరివేపాకుల వాడి వదిలేస్తారు. దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా ప్రధమ స్థానంలో సీఎం జగన్ ఉంటారు. బీసీ వర్గాలకు చెందిన తమకు రాజ్యసభ పదవులు వస్తాయని అనుకోలేద’ని అన్నారు. ( సీఎం జగన్‌ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు ) ముందు చూపుతో అభ్యర్థులను ఎంపిక చేశారు : అయోధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో అభ్యర్థులను ఎంపిక చేశారని వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థి అయోధ్య రామిరెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామన్నారు. సీఎం వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నానన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా మేకిన్ ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. వైఎస్ జగన్ రాజ్యసభ ఇవ్వటం గర్వంగా ఉంది : నత్వాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు రాజ్యసభ ఇవ్వటం గర్వంగా ఉందని వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థి పరిమల్ నత్వాని అన్నారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై తమ ఛైర్మన్ అంబానీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించారని తెలిపారు. -
గుంటూరు జిల్లాకు జాక్‌పాట్
-
సీఎం జగన్‌ను కలిసిన మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంత్రి మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభకు ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ను కలిసిన అనంతరం అయోధ్య రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని మరో సారి నిరూపితం అయిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని చెప్పారు. (‘మంచి అవకాశం.. సీఎంకు కృతజ్ఞతలు’) చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు: మంత్రి మోపిదేవి రాజ్యసభ అభ్యర్థిత్వంలో 50 శాతం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయం అని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి బీసీలపై ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందని పేర్కొన్నారు. ఒక్క రాజ్యసభే కాదని.. బీసీలను ఓటు బ్యాంక్ రాజకీయాల నుంచి అధికారం వైపు తీసుకెళ్లిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. పరిమల్ నత్వాని ఎంపిక రాష్ట్ర అవసరాలు, అభివృద్ధి దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఒక్కోసారి రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కోసం నిర్ణయం తీసుకోవాల్సివస్తుందని వివరించారు. నత్వాన్ని అభ్యర్థిత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదని మంత్రి మోపిదేవి మండిపడ్డారు. (ఇది బీసీలకు దక్కిన అరుదైన గౌరవం) -
‘రాంకీ’కి గల్ఫ్‌లో 3 కొత్త ప్రాజెక్టులు
మూడు రోడ్డు ప్రాజెక్టులు విక్రయానికి సిద్ధం రాంకీ గ్రూప్ చైర్మన్ అయోధ్య రామిరెడ్డి వెల్లడి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: సివిల్ కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వేస్ట్ మేనేజ్మెంట్ రంగాల్లో నిమగ్నమైన రాంకీ గ్రూప్ గల్ఫ్ దేశాల్లో మూడు కొత్త ప్రాజెక్టులను చేపట్టనుంది. పర్యావరణ, వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ఓమన్, సౌదీ అరేబియా దేశాల్లో రూ. 200 కోట్లతో ప్రాజెక్టులను చేపడుతున్నామని రాంకీ గ్రూప్ చైర్మన్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్న అయోధ్య రామిరెడ్డి గురువారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ...ఓమన్‌లో ఖింజీ రామ్‌దాస్ సంస్థతో రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ తాజాగా వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు చేపడుతున్నామన్నారు. మెటీరియల్ రీసైక్లింగ్ ఫెసిలిటీ కోసం ఇందాద్‌తో కలసి మరో ప్రాజెక్టు చేస్తున్నామన్నారు. కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాలో అట్కో గ్రూప్‌తో కలసి ఇంకో ప్రాజెక్టు చేపడుతున్నామని చెప్పారు. తాజా పెట్టుబడులతో గల్ఫ్ దేశాల్లో తమకు మరింత పట్టు పెరుగుతుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. తుది దశలో రోడ్డు ప్రాజెక్టుల విక్రయం? రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న క్యాష్ ఫ్లో లోటు సమస్య నుండి బయటపడేందుకు నామ్ ఎక్స్‌ప్రెస్‌వే, సెహోర్ కోస్మి, రాంకీ ఎస్లామిక్స్ హైదరాబాద్ రింగ్ రోడ్ ప్రాజెక్టులను విక్రయానికి పెట్టామని, సరైన కొనుగోలుదారు దొరికితే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గౌతం రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ ప్రాజెక్టుల విక్రయం ద్వారా రూ వెయ్యి కోట్లు ఆశిస్తున్నామన్నారు. ప్రస్తుతం తమ సంస్థకు రూ. 1,400 కోట్ల రుణాలున్నాయని, వీటిని తీర్చేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఒక నెలలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. అజయ్ పిరమల్ గ్రూప్ ఈ ప్రాజెక్టులను చేజిక్కించుకునే రేస్‌లో మొదటి స్థానంలో ఉందన్న ఊహాగానాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గౌతం రెడ్డిని ఇదే విషయమై ప్రశ్నించగా, ప్రస్తుతం తామేమీ వ్యాఖ్యానించలేమన్నారు. ‘‘రోడ్డు ప్రాజెక్టుల విక్రయానికి సంబంధించి పలు సంస్థలతో సంప్రదిస్తున్నాం. కొన్ని సంస్థలతో నాన్ డిస్క్లోజర్ ఒప్పందాలు చేసుకున్నాం. మేం సంప్రదిస్తున్న కంపెనీల్లో సింగపూర్‌కు చెందిన కన్సార్షియంతో పాటు కొన్ని ఇన్వెస్ట్మెంట్ సంస్థలు కూడా ఉన్నాయి’’ అని ఆయన చెప్పారు. -
వైఎస్ ఆశయసాధకుడు జగన్
దాచేపల్లి, న్యూస్‌లైన్ :దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయసాధన కోసం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ముత్యాలంపాడు, తంగెడ, సారంగపల్లి అగ్రహారం, మాదినపాడు, దాచేపల్లి గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రచారరథంపై ఆళ్ల, గురజాల అసెంబ్లీ అభ్యర్థి జంగా కృష్ణమూర్తి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారం నిర్వహించారు. గ్రామాలకు వచ్చిన ఆళ్ల, జంగా, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. పచారరథంపై నుంచి ఫ్యానును చూపిస్తూ అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థులు ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేసి ప్రజల గుండెల్లో వైఎస్సార్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పా రు. మడమ తిప్పని, మాటతప్పని నేతగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసిన ఘనత మహనేతకే దక్కుతుందన్నారు. పేదబడుగు బలహీనవర్గాల అభ్యన్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసిన వైఎస్సార్ పేదల పాలిట దేవుడన్నారు. దివంగత మహానేత ఆశయాలు సాధిం చాలంటే తప్పనిసరిగా వైఎస్ జగన్ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. పజలు కోరుకున్న సువర్ణ పరిపాలన అందించే సత్తా జగన్‌కు మాత్రమే ఉందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి జంగా మాట్లాడుతూ రాజన్న రాజ్యం కోసం జగన్‌ను సీఎం చేయాలని పిలుపునిచ్చారు. విశ్వసనీయతే ఆయుధంగా ఎన్నికల బరిలో ఉన్న తమను గెలిపించాలని, పల్నాటి ప్రాంత అభివృద్ధికి పనిచేస్తామని జంగా చెప్పారు.ప్రచార కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ షేక్ జాకీర్‌హుస్సేన్, మాజీ ఎంపీపీలు అంబటి శేషగిరిరావు, కొప్పుల సాంబయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భూషణం చెన్నయ్య, సర్పంచ్‌లు బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డి, బాసిపోగు రాంబాబు, ఎంపీపీ అభ్యర్థులు మందపాటి రమేష్‌రెడ్డి, బొమ్మిరెడ్డి రామకృష్ణ, జెడ్పీటీసీ అభ్యర్థి మూలగోండ్ల ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అయోధ్యరామిరెడ్డి నామినేషన్‌కు పోటెత్తిన జనం
విద్యానగర్(గుంటూరు), న్యూస్‌లైన్ :జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మద్దతుగా భారీగా ర్యాలీలతో తరలివచ్చారు. నగరంలోని చుట్టుగుంట సెంటర్ నుంచి వేలాది మంది కార్యకర్తలు ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ర్యాలీలో కార్యకర్తలు అభిమానులు పులివెందుల పులిబిడ్డ జగన్ నాయకత్వం వర్థిల్లాలి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్థిల్లాలి, వైఎస్సార్ జోహార్, అయోధ్యరామిరెడ్డి నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అయోధ్యరామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పేదలకు సొంతిల్లు వైఎస్సార్సీపీ.. అనంతరం విలేక రులతో అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. వైఎస్సార్సీపీ మధ్యతరగతి పార్టీ అని, పేదలకు సొంతిల్లు లాంటిదన్నారు. జిల్లాలో బ్రహ్మాండమైన మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థులందరి గెలుపు ఖాయమన్నారు. పేదలు, ప్రజలు ఎప్పుడు రాజన్న రాజ్యం చూడాలా అని ఆశగా ఎదురు చూస్తున్నారని, మరో నెల రోజుల్లో సుఖశాంతులతో తులతూగే రాజన్న రాజ్యాన్ని ప్రజలు చూస్తారని చెప్పారు. రెండు నెలల నుంచి నరసరావుపేట డివిజన్లో ప్రతి గ్రామం తిరుగుతున్నానని, స్థానికంగా ఉన్న సమస్యలను పరిశీలిస్తున్నానని, తప్పని సరిగా సరైన ప్రణాళిక ద్వారా ఐదేళ్లలో నరసారావుపేట డివిజన్‌ను అభివృద్ధి చేస్తాన ని చెప్పారు. రాయపాటి, గల్లా నామినేషన్ల దాఖలు టీడీపీ నరసరావు పేట ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు, గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ర్యాలీగా ఆ పార్టీనాయకులు, కార్యకర్తలతో మార్కెట్ సెంటర్ నుంచి కలెక్టరేట్‌కు చేరుకుని నామినేషన్లు దాఖలు చేశారు.ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ పల్నాడు అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. నియోజకవర్గ నాయకులు అసమ్మతితో ఉన్న మాట వాస్తవమేనని, కొన్ని రోజుల్లో సర్దుకుపోతుందని చెప్పారు. గల్లా జయదేవ్ మాట్లాడుతూ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. పరిశ్రమలు స్థాపనకు కృషిచేసి ప్రతి గ్రామంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని చెప్పారు. పోలీసుల హడావుడి.. ర్యాలీగా వస్తున్న ప్రజలపై పోలీసులు తమదైన శైలిలో ప్రతాపాన్ని చూపారు. ర్యాలీగా వస్తున్న వాహనాలను నిలిపి కేసులు నమోదు చేశారు. ద్విచక్రవాహనాలను సైతం స్టేషన్లకు తరలించారు. కలెక్టర్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో జనసంచారం ఉండకుండా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థితోపాటు మరో నలుగురిని మాత్రమే కలెక్టరేట్‌లోకి అనుమతించారు. -
'వైఎస్ఆర్ పథకాల అమలే వైఎస్ఆర్సీపీ ధ్యేయం'
గుంటూరు: నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి అయోధ్య రామిరెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... పేద ప్రజల సంక్షేమం, వైఎస్ఆర్ పథకాల అమలే వైఎస్ఆర్ సీపీ ధ్యేయం అని అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉండి పరిష్కరిస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేద ప్రజలకు చేరుతాయన్నారు. అభివృద్ది కేవలం వైఎస్ జగన్ తోనే సాధ్యమని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. నరసరావుపేటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి భారీ స్పందన లభించింది. -
వైఎస్సార్ సీపీ బలోపేతం
వినుకొండ, న్యూస్‌లైన్ :వినుకొండ నియోజవకర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ విజయం దిశగా ముందుకు సాగుతున్నామని ఆ పార్టీ నరసరావుపేట లోక్‌సబ అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి తెలిపారు. పట్టణంలోని లాయర్ స్ట్రీట్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నన్నపనేని సుధతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని నియోజవర్గాలను మరింతగా బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నామని వివరించారు. వినుకొండ నియోజవకర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, డీసీసీ అధ్యక్షుడు ఉన్నందున మరికొంత శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కొంత ఒత్తిళ్లకు గురికావాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఏకకాలంలో మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో పార్టీ మరింత పురోగతి సాధించేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఎన్నికల హడావుడిలో ఉన్న తనకు సమన్వయకర్త డాక్టర్ సుధకు మధ్య విభేదాలు వచ్చినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. తమ పార్టీ గోల్ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించడం ఒక్కటేనన్నారు. పార్టీ క్యాడర్, పబ్లిక్కు ఎలాంటి గందరగోళం లేదని డాక్టర్ సుధ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న ఒత్తిళ్లను అధిగమించి ముందుకు వెళ్తామన్నారు. సమన్వయకర్త డాక్టర్ సుధ మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో గెలుపే ధ్యేయంగా ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి సారథ్యంలో పనిచేస్తామని తెలిపారు. తండ్రిలా భావిస్తున్న అయోధ్యరామిరెడ్డి సలహా లు, సూచనలతో రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి పనిచేస్తామని వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారని అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయం చేకూర్చాలని విజ్ఞప్తిచేశారు.సమావేశంలో ఆళ్ళ పేరిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ దెబ్బకు ప్రత్యర్థుల డబ్బాలు ఖాళీ
జిల్లాలో వైఎస్సార్సీపీ గాలి వీస్తోందనీ, అందులో ప్రత్యర్థులు కొట్టుకుపోవడం ఖాయమని నరసరావు పేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. బాపట్లలో మంగళవారం రాత్రి కోన రఘుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన మునిసిపల్ నగారాలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. దేశ చరిత్రలో ఒకేసారి మూడు ఎన్నికలు రావటం ఇదే మొదటిసారనీ, కేవలం వైఎస్సార్సీపీని దెబ్బతీయటానికి కాంగ్రెస్ పన్నిన కుట్ర అని ఆయన విమర్శించారు. బాపట్ల, న్యూస్‌లైన్ జిల్లాలో వైఎస్సార్సీపీ గాలి వీస్తోందనీ, అందులో ప్రత్యర్థులు కొట్టుకుపోవడం ఖాయమని నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. బాపట్లలో మంగళవారం రాత్రి నిర్వహించిన మునిసిపల్ నగారాలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. దేశ చరిత్రలో ఒకేసారి మూడు ఎన్నికలు రావటం ఇదే మొదటిసారనీ, కేవలం వైఎస్సార్సీపీని దెబ్బతీయటానికి కాంగ్రెస్ పన్నిన కుట్ర అని ఆయన విమర్శించారు. అయితే తామే కొట్టుకుపోవడం ఖాయమని చెప్పారు. వైఎస్సార్సీపీకి, జగన్‌కు ఎందుకు అండగా ఉండాలో ఆయన సోదాహరణగా వివరించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ వైఎస్‌రాజశేఖరరెడ్డి హయాంలో మంచి జరిగిందనీ, ఆయన లేనిలోటు ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి తీరుస్తారని చెప్పారు. కేవలం ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని అత్యంత దారుణంగా విభజించిన కాంగ్రెస్ సీమాంధ్రకు తీరని అన్యాయం చేసిందనీ, ఇప్పుడు అంధ్రాను అభివృద్ధి చేయగల సత్తా జగన్మోహనరెడ్డికి మాత్రమే ఉందన్నారు. ఆయన నాయకత్వాన్ని నచ్చే దేశంలోని ఐఏఎస్‌లు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మూడు సంవత్సరాల వయస్సు కలిగిన పార్టీని ఓడించటానికి వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ చేయని రాజకీయం అంటూ లేదన్నారు. వైయస్‌లా కోన ప్రభాకర్‌రావు కూడా గొప్ప నాయకుడని కొనియాడారు. బాపట్ల పార్లమెంటు పరిశీలకుడు గుదిబండి చినవెంకటరెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక, మునిసిపల్, మండల పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా నాయకుడు మురళీకృష్ణ, నియోజకవర్గ సమన్వయకర్త కోనరఘుపతి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో దేవరపల్లి స్వర్ణకుమారి, మున్సిపల్ మాజీ చైర్మన్ నరాలశెట్టి ప్రకాశరరావు, పట్టణ, మండల కన్వీనర్లు దగ్గుమల్లి ధర్మారావు, గవిని కృష్ణమూర్తి, దొంతిరెడ్డి సీతారామిరెడ్డి, హుస్సేన్, యూత్ నాయకులు స్వర్ణకుమార్‌రెడ్డి, అవినాష్‌నాయుడు, శాయిల మురళి, కొండారెడ్డి అనిల్, మార్పు బెనర్జీ, మండే విజయ్‌కుమార్, భోగిరెడ్డి రమేష్‌రెడ్డి, సేవాదళ్ నాయకులు పిల్లి శేఖర్, దిల్షాద్బేగం, వేల్పుల మీరాభి, మండే రుతూ, పేర్లీ వసుంధరా తదితరులు పాల్గొన్నారు.