
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంత్రి మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభకు ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ను కలిసిన అనంతరం అయోధ్య రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని మరో సారి నిరూపితం అయిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని చెప్పారు. (‘మంచి అవకాశం.. సీఎంకు కృతజ్ఞతలు’)
చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు: మంత్రి మోపిదేవి
రాజ్యసభ అభ్యర్థిత్వంలో 50 శాతం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయం అని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బీసీలపై ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందని పేర్కొన్నారు. ఒక్క రాజ్యసభే కాదని.. బీసీలను ఓటు బ్యాంక్ రాజకీయాల నుంచి అధికారం వైపు తీసుకెళ్లిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. పరిమల్ నత్వాని ఎంపిక రాష్ట్ర అవసరాలు, అభివృద్ధి దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఒక్కోసారి రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కోసం నిర్ణయం తీసుకోవాల్సివస్తుందని వివరించారు. నత్వాన్ని అభ్యర్థిత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదని మంత్రి మోపిదేవి మండిపడ్డారు. (ఇది బీసీలకు దక్కిన అరుదైన గౌరవం)
Comments
Please login to add a commentAdd a comment