వైఎస్సార్ సీపీ దెబ్బకు ప్రత్యర్థుల డబ్బాలు ఖాళీ
జిల్లాలో వైఎస్సార్‌సీపీ గాలి వీస్తోందనీ, అందులో ప్రత్యర్థులు కొట్టుకుపోవడం ఖాయమని నరసరావు పేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. బాపట్లలో మంగళవారం రాత్రి కోన రఘుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన మునిసిపల్ నగారాలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. దేశ చరిత్రలో ఒకేసారి మూడు ఎన్నికలు రావటం ఇదే మొదటిసారనీ, కేవలం వైఎస్సార్‌సీపీని దెబ్బతీయటానికి కాంగ్రెస్ పన్నిన కుట్ర అని ఆయన విమర్శించారు.
బాపట్ల, న్యూస్‌లైన్
జిల్లాలో వైఎస్సార్‌సీపీ గాలి వీస్తోందనీ, అందులో ప్రత్యర్థులు కొట్టుకుపోవడం ఖాయమని నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. బాపట్లలో మంగళవారం రాత్రి నిర్వహించిన మునిసిపల్ నగారాలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. దేశ చరిత్రలో ఒకేసారి మూడు ఎన్నికలు రావటం ఇదే మొదటిసారనీ, కేవలం వైఎస్సార్‌సీపీని దెబ్బతీయటానికి కాంగ్రెస్ పన్నిన కుట్ర అని ఆయన విమర్శించారు. అయితే తామే కొట్టుకుపోవడం ఖాయమని చెప్పారు. వైఎస్సార్‌సీపీకి, జగన్‌కు ఎందుకు అండగా ఉండాలో ఆయన సోదాహరణగా వివరించారు.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ వైఎస్‌రాజశేఖరరెడ్డి హయాంలో మంచి జరిగిందనీ, ఆయన లేనిలోటు ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి తీరుస్తారని చెప్పారు. కేవలం ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని అత్యంత దారుణంగా విభజించిన కాంగ్రెస్ సీమాంధ్రకు తీరని అన్యాయం చేసిందనీ, ఇప్పుడు అంధ్రాను అభివృద్ధి చేయగల సత్తా జగన్‌మోహనరెడ్డికి మాత్రమే ఉందన్నారు. ఆయన నాయకత్వాన్ని నచ్చే దేశంలోని ఐఏఎస్‌లు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మూడు సంవత్సరాల వయస్సు కలిగిన పార్టీని ఓడించటానికి వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ చేయని రాజకీయం అంటూ లేదన్నారు. వైయస్‌లా కోన ప్రభాకర్‌రావు కూడా గొప్ప నాయకుడని కొనియాడారు.
బాపట్ల పార్లమెంటు పరిశీలకుడు గుదిబండి చినవెంకటరెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక, మునిసిపల్, మండల పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా నాయకుడు మురళీకృష్ణ, నియోజకవర్గ సమన్వయకర్త కోనరఘుపతి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో దేవరపల్లి స్వర్ణకుమారి, మున్సిపల్ మాజీ చైర్మన్ నరాలశెట్టి ప్రకాశరరావు, పట్టణ, మండల కన్వీనర్లు దగ్గుమల్లి ధర్మారావు, గవిని కృష్ణమూర్తి, దొంతిరెడ్డి సీతారామిరెడ్డి, హుస్సేన్, యూత్ నాయకులు స్వర్ణకుమార్‌రెడ్డి, అవినాష్‌నాయుడు, శాయిల మురళి, కొండారెడ్డి అనిల్, మార్పు బెనర్జీ, మండే విజయ్‌కుమార్, భోగిరెడ్డి రమేష్‌రెడ్డి, సేవాదళ్ నాయకులు పిల్లి శేఖర్, దిల్‌షాద్‌బేగం, వేల్పుల మీరాభి, మండే రుతూ, పేర్లీ వసుంధరా తదితరులు పాల్గొన్నారు.