అధికారం తమ చేతిలో ఉందనే అహంతో తెలుగుదేశం పార్టీ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా ....
చిత్తూరు : అధికారం తమ చేతిలో ఉందనే అహంతో తెలుగుదేశం పార్టీ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా గుడిపాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై శనివారం టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆరుగురు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు గుంటూరు జిల్లా బాపట్లలో రుణమాఫీపై ఆందోళనకు దిగిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలతో టీడీపీ శ్రేణులు వాగ్వివాదానికి దిగారు. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.