వైఎస్సార్‌సీపీ కార్యాలయం నిర్మిస్తున్న భూమి మాది కాదు: ఆర్టీసీ | Land under construction by YSRCP office in not ours: RTC | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యాలయం నిర్మిస్తున్న భూమి మాది కాదు: ఆర్టీసీ

Published Wed, Dec 21 2022 7:55 AM | Last Updated on Wed, Dec 21 2022 8:12 AM

Land under construction by YSRCP office in not ours: RTC - Sakshi

సాక్షి, అమరావతి: బాపట్లలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం నిర్మిస్తోన్న స్థలం ఆర్టీసీది కాదని ఆ సంస్థ ప్రకటించింది. ‘ఆర్టీసీ స్థలంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం’ అని కొన్ని పత్రికలు ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. 1990లో ఆర్టీసీకి కేటాయించిన ఆ స్థలాన్ని 2003లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం రద్దు చేసి ఏపీఐఐసీకి తిరిగి అప్పగించిందని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఆ ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం..1990లో ఏపీఐఐసీ బాపట్లలో సర్వే నంబర్‌ 1291/2ఏతో ఉన్న 10.62 ఎకరాలను ఆరీ్టసీకి కేటాయించింది. సేల్‌ డీడ్‌ ద్వారా రూ.3.60 లక్షలకు కేటాయించడంతో ఆర్టీసీ ఆ భూమిని 1990 జనవరి 1న తమ ఆ«దీనంలోకి తీసుకుంది. అందులో 6.54 ఎకరాల్లో ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ను నిర్మించి మిగిలిన 4.08 ఎకరాలను భవిష్యత్‌ అవసరాల కోసం ఉంచింది.

ఆ భూమిని నిరుపయోగంగా ఉంచడం ఒప్పంద నిబంధనలకు విరుద్ధమని 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ ఆర్టీసీకి నోటీసులిచ్చారు. 2003, డిసెంబర్‌ 8న ఆ భూమిని ఏపీఐఐసీ తిరిగి స్వాధీనం చేసుకుంది. ఆ భూమి ఏపీఐఐసీకి చెందినదని బోర్డు కూడా ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఆ భూమిపై ఆర్టీసీకి ఎలాంటి హక్కు లేదు. ఆ భూమి ఏపీఐఐసీ ఆధీనంలోనే ఉంది. ఆ భూ­మిని ఏ సంస్థకైనా కేటాయించే అధికారం ఏపీఐఐసీకి ఉంది. అందులో ఆర్టీసీకి ఎలాంటి ప్రమేయం ఉండదు’ అని వివరించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement