వైఎస్ ఆశయసాధకుడు జగన్
దాచేపల్లి, న్యూస్‌లైన్ :దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయసాధన కోసం ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ముత్యాలంపాడు, తంగెడ, సారంగపల్లి అగ్రహారం, మాదినపాడు, దాచేపల్లి గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రచారరథంపై ఆళ్ల, గురజాల అసెంబ్లీ అభ్యర్థి జంగా కృష్ణమూర్తి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారం నిర్వహించారు. గ్రామాలకు వచ్చిన ఆళ్ల, జంగా, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
పచారరథంపై నుంచి ఫ్యానును చూపిస్తూ అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థులు ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేసి ప్రజల గుండెల్లో వైఎస్సార్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పా రు. మడమ తిప్పని, మాటతప్పని నేతగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసిన ఘనత మహనేతకే దక్కుతుందన్నారు. పేదబడుగు బలహీనవర్గాల అభ్యన్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసిన వైఎస్సార్ పేదల పాలిట దేవుడన్నారు. దివంగత మహానేత ఆశయాలు సాధిం చాలంటే తప్పనిసరిగా వైఎస్ జగన్ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు.
పజలు కోరుకున్న సువర్ణ పరిపాలన అందించే సత్తా జగన్‌కు మాత్రమే ఉందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి జంగా మాట్లాడుతూ రాజన్న రాజ్యం కోసం జగన్‌ను సీఎం చేయాలని పిలుపునిచ్చారు. విశ్వసనీయతే ఆయుధంగా ఎన్నికల బరిలో ఉన్న తమను గెలిపించాలని, పల్నాటి ప్రాంత అభివృద్ధికి పనిచేస్తామని జంగా చెప్పారు.ప్రచార కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ షేక్ జాకీర్‌హుస్సేన్, మాజీ ఎంపీపీలు అంబటి శేషగిరిరావు, కొప్పుల సాంబయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భూషణం చెన్నయ్య, సర్పంచ్‌లు బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డి, బాసిపోగు రాంబాబు, ఎంపీపీ అభ్యర్థులు మందపాటి రమేష్‌రెడ్డి, బొమ్మిరెడ్డి రామకృష్ణ, జెడ్పీటీసీ అభ్యర్థి మూలగోండ్ల ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.