port cities
-
స్మార్ట్ సిటీలుగా పోర్టు నగరాలు
-
స్మార్ట్ సిటీలుగా పోర్టు నగరాలు
రూ. 50 వేల కోట్లతో ప్రణాళిక: గడ్కారీ న్యూఢిల్లీ: దేశంలోని ప్రధానమైన 12 పోర్టు నగరాలను రూ. 50 వేల కోట్లతో స్మార్ట్ సిటీలుగా నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కొక్క దానికి రూ. 3 నుంచి 4 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గ డ్కారీ ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘12 పోర్టు నగరాలను గ్రీన్ స్మార్ట్ సిటీలుగా మార్చాలని నిర్ణయించాం. ఆరు నెలల్లో పనులు మొదలు పెట్టి ఐదు ఏళ్లలో పూర్తి చేస్తాం’ అని తెలిపారు. కేంద్రం అధీనంలోని ఈ 12 పోర్టుల్లో రూ. 2.64 లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నట్లు అంచనా వేశారు. ముంబై పోర్టులో 753 హెక్టార్ల భూమిని గుర్తించారు. ‘ పోర్టుల్లోని ప్రభుత్వ భూములను జీపీఎస్ వ్యవస్థ ద్వారా గుర్తించాం. వీటిని బిల్డర్లకు అమ్మాలనుకోవట్లేదు. మేమే అభివృద్ధి చేస్తామ’ని తెలిపారు. అయితే ఈ నగరాల్లో ఇళ్లు నిర్మించడానికి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తామని చెప్పారు. పోర్టు నీటిని రీసైకిల్ చేస్తామని, వ్యర్థ పదార్థాలను బయో గ్యాస్‌కు వినియోగిస్తామని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీలకు ఎంపికైన పోర్టు నగరాలు కాండ్లా, ముంబై. జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్(జేఎన్పీటీ), మార్ముగావ్, కొత్త మంగళూరు, కొచ్చి, చెన్నై, ఎన్నూర్, వీవో చిదంబర్నర్, విశాఖపట్నం, పారాదీప్, కోల్‌కతా(హ ల్దియాతో కలిపి). -
పోర్టు సిటీల మధ్య చుక్ చుక్
- నేడు పారాదీప్ రైలు ప్రారంభం విశాఖపట్నం : పోర్టు కార్యకలాపాల కేంద్రాలైన విశాఖ-పారాదీప్‌ల మధ్య ఓ వీక్లీ రైలు ఎట్టకేలకు నడవనుంది. ఈ రెండు పట్టణాల మధ్య రైలు నడుపుతున్నట్లు గత బడ్జెట్లో రైల్వే శాఖ ప్రకటించింది. బుధవారం ఢిల్లీ నుంచి రైల్వే మంత్రి రిమోట్ ద్వారా రైలును ప్రారంభించనున్నారు. విశాఖ నుంచి దాదాపు 554 కిలోమీటర్ల దూరంలోని పారాదీప్‌కు వెళ్లాలంటే గతంలో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. శ్రీకాకుళం దరి పలాస నుంచి డీఎంయూ రైలు ద్వారా కొందరు పారాదీప్‌కు వెళుతుంటే ఎక్కువ శాతం మంది భువనేశ్వర్, కటక్ మీదుగా ప్రయాణించి పారాదీప్‌కు చేరుకునే వారు. విశాఖ పోర్టు, పారాదీప్ పోర్టులు రెండూ మేజర్ పోర్టులే కావడంతో ఈ రెండు నగరాల మధ్య అనేక ఏళ్లుగా షిప్పింగ్ కంపెనీలు, మత్స్యకారుల మధ్య వ్యాపార, వాణిజ్య లావాదేవీలు జరిగేవి. ఇప్పుడీ రైలు రాకతో మరింత వేగంగా ఇరు ప్రాంతాల సంబంధాలు పెరుగుతాయని వ్యాపార వేత్తలు అంచనా వేస్తున్నారు. పారాదీప్ వేళలు విశాఖపట్నం-పారాదీప్-విశాఖపట్నం(22810/09) వారాంతపు ఎక్స్‌ప్రెస్ ప్రతీ వారం విశాఖ నుంచి బయల్దేరుతుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రతీ ఆదివారం రాత్రి 11.50 గంటలకు విశాఖ(22810) నుంచి బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు పారాదీప్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో పారదీప్(22809) నుంచి ప్రతీ బుధవారం రాత్రి 10.30 గంటలకు బయల్దేరి గురువారం ఉదయం 8.30 గంటలకు విశాఖకు చేరుతుంది.