స్మార్ట్ సిటీల తొలి జాబితా విడుదల
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాలు విశాఖపట్నం, కాకినాడలకు స్థానం దక్కింది. 20 నగరాల పేర్లతో కూడిన స్మార్ట్ సిటీల తొలి జాబితాను గురువారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీల ఎంపికలో పారదర్శక విధానం పాటించామన్నారు. ఆకర్షణీయ నగరాల కోసం రూ. 3 లక్షల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఆకర్షణీయ నగరాలతో జీవన ప్రమాణాలు మెరుగవుతావుతాయని అన్నారు.
స్మార్ట్ సిటీ చాలెంజ్ లో తెలంగాణ నగరాలకు అవకాశం దక్కలేదు. ఒక పాయింట్ తేడాతో వరంగల్ అవకాశం కోల్పోయింది. విశాఖ 8, కాకినాడ 14 స్థానాల్లో నిలిచాయి.
తొలి జాబితాలోని స్మార్ట్ సిటీలు
1. భువనేశ్వర్
2. పుణె
3. జైపూర్
4. సూరత్
5. కొచ్చి
6. అహ్మదాబాద్
7. జబల్పూర్
8. విశాఖపట్నం
9. సోలాపూర్
10. దావణగెరె
11. ఇండోర్
12. న్యూఢిల్లీ
13. కోయంబత్తూరు
14. కాకినాడ
15. బెల్గావి
16. ఉదయపూర్
17. గువాహటి
18. చెన్నై
19. లుథియానా
20. భోపాల్