స్మార్ట్ విలేజ్ మరింత మేలు | better to concentrate on smart villages than smart cities | Sakshi
Sakshi News home page

స్మార్ట్ విలేజ్ మరింత మేలు

Published Fri, Jul 18 2014 1:59 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

స్మార్ట్ విలేజ్ మరింత మేలు - Sakshi

స్మార్ట్ విలేజ్ మరింత మేలు

వంద స్మార్ట్ నగరాలను నిర్మించాలన్న యోచనతో పాటు స్మార్ట్ గ్రామాల నిర్మాణం గురించి కూడా ప్రధాని దృష్టి పెట్టాలి. స్మార్ట్ విలేజ్ ఏర్పడితే స్థానికంగా జరిగిన ఉత్పత్తికీ, స్థానికంగా జరిగే సేకరణకీ, స్థానికంగా జరిగే పంపిణీకీ మధ్య దానికదే ఒక  లంకె ఏర్పడుతుంది.
 
భారతీయ రైతాంగం అలా ఎప్పుడూ నిర్లక్ష్యానికి ఎందుకు గురౌతూ ఉం టుందో నాకు ఏనాటికీ అర్థం కాని విషయం. చిన్న పాటి వ్యయాలతోనే మన రైతులు పుష్కలంగా పంటలు పండిస్తూ ఉంటారు.  ఉత్తేజం కలిగించే విధం గా ఒక ఆర్థిక ప్యాకేజీని కనుక ఇచ్చినట్టయితే, రైతులు ఈ దేశాన్ని ఆహా రంతో, పళ్లూ కూరగాయలతో ముంచెత్తుతారు. అత్యధికంగా వ్యవసాయోత్ప త్తులను ఎగుమతి చేసే దేశంగా భారత్ అవతరించడం ఖాయం.
 
2013-14 సంవత్సరంలో రైతులు రికార్డు స్థాయిలో 264.4 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలను పండించారు. 4.8 శాతం పెంపుతో చమురు గింజల ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలో 34.5 మిలి యన్ టన్నులకు చేరుకుంది. మొక్కజొన్న కూడా 8.52 శాతం అధికంగా దిగుబడి సాధ్యమైంది. అంటే 24.2 మిలియన్ టన్ను ల మొక్కజొన్న ఉత్పత్తి అయింది. అపరాలు లేదా పప్పుధాన్యా ల ఉత్పత్తి మున్నెన్నడూ లేని రీతిలో 19.6 మిలియన్ టన్నుల దిగుబడిని మన రైతులు సాధ్యం చేశారు.
 
ఇది గతేడాది కంటె 7.10 శాతం ఎక్కువ. పత్తి ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలోనే జరి గింది. వ్యవసాయోత్పత్తులలో ఇంత భారీ పెరుగుదల ఉన్నప్ప టికీ 2013-14 సంవత్సరం వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగా నికి దక్కింది రూ. 19,307 కోట్లు. ఇది మొత్తం ప్రణాళికా వ్య యంలో ఒక్క శాతం కంటె తక్కువ. ఈ బడ్జెట్‌లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యవసాయం, సహకార విభాగాలకి రూ. 22,652 కోట్లు కేటాయించారు.
 
సేద్యమంటే చిన్న చూపే
సేద్యాన్ని నిర్లక్ష్యం చేయడమనే మాట 1991లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టినప్పటి నుంచి వింటున్నాం. అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చి న ప్రసిద్ధ బడ్జెట్ ప్రసంగంలో పారిశ్రామిక రంగం మీద వరాల జల్లు కురిపిం చి, తరువాత పేరాలో మాత్రం ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే మూలాధార మని చెప్పడం నాకింకా గుర్తు.  కానీ వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం. అందుకే ఆ రంగానికి అవసరమైన చేయూతను ఇచ్చే బాధ్యతను మన్మోహన్ సింగ్ రాష్ట్రాల మీద పెట్టారు. అప్పుడు ఆయనొక సంగతి విస్మరించారు. పరిశ్రమలు కూడా రాష్ట్ర జాబితాలోనివే. ఆ అంశాన్ని కూడా నాటి కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించి ఉండవలసింది. దీనితో ఆయన పక్షపాత వైఖరి ఎలాంటిదో సుస్పష్టంగానే కనిపిస్తుంది.
 
పదకొండో పంచవర్ష ప్రణాళికా కాలంలో (2007-08 - 2011-12) వ్యవసాయరంగం ఎంతో తృప్తిని కలిగిస్తూ 4.1 శాతం వృద్ధి రేటును సాధిం చింది. అయినప్పటికీ ఆ రంగానికి దక్కినది మరీ ఘోరంగా ఒక లక్ష కోట్లే. ప్రత్యక్షంగా, పరోక్షంగా 60 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగమది. అలాంటి రంగానికి ఐదేళ్లకి గాను లక్ష కోట్లు ఖర్చు చేయడమంటే అది ఏమూ లకి?  పన్నెండో పంచవర్ష ప్రణాళిక (2012-13 -- 2017-18)లో ఆ కేటా యింపును రూ. 1.5 లక్షల కోట్లకు పెంచారు. అయితే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగానికి రూ. 5.73 లక్షల కోట్లు పన్ను మినహా యింపును ఇచ్చారు. ఆర్థిక రాడార్ తెర మీద నుంచి రైతులు అదృశ్యమైపో యారని నేను చాలాకాలంగా చెబుతూనే ఉన్నాను.
 
పరిశ్రమలకు పన్ను బాధ లేదు
2004-05 సంవత్సరం నుంచి కార్పొరేట్ భారతానికి రూ. 31 లక్షల కోట్ల మేర పన్ను మినహాయింపు లభించింది. దీనితో ఉత్పత్తి పెరుగుతుందనీ, కొత్త ఉద్యోగాలు వస్తాయనీ అంతా ఆశించారు. అయితే, గడచిన పదేళ్లలో 1.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించారు గానీ, పారిశ్రామికోత్పత్తులలో ఎలాంటి పురోగతీ లేదు. దీనికి పరాకాష్ట ఏమిటంటే- కార్పొరేట్ రంగం రూ. పది లక్షల కోట్ల మిగులును వెనకేసుకోవడం, దాదాపు పది లక్షల కోట్ల రూపా యల మేర బ్యాంకుల రుణాలను (మొండిబకాయిలన్నమాట) ఎగవేయడం.  
 
చట్టబద్ధంగా పేదవర్గాలకు రావలసిన ఆర్థిక మద్దతు వారికి ఎలా రాకుండా పోతున్నదో, ఉన్న వనరులను సంపన్న వర్గాలకు ఎలా సౌకర్యంగా మళ్లిస్తున్నారో ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది. వ్యవసాయ రంగం 60 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నదని ఇంత క్రితమే చెప్పుకున్నాం. అందులో 82.2 శాతం చిన్న, మధ్య తరహా రైతులే. వీరికి ఆర్థిక మద్దతు లేకున్నా ఎలా గో నెట్టుకొస్తున్నారు. అయితే  60 శాతం రైతాంగం పస్తులతో బాధ పడుతు న్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యవసాయం ఏమాత్రం లాభసాటి కాని వ్యాపకంగా తయారవుతూ ఉండడంతో 42 శాతం రైతులు సేద్యానికి వీడ్కోలు పలకాలని చూస్తున్నారు.
 
వ్యవసాయం పూర్తిగా నిలిచిపోయి, వ్యవ సాయం మీద ఆధారపడిన వారంతా పట్టణాలకీ నగరాలకీ చేరుకునే విష యం మీద ప్రధాన స్రవంతి ఆర్థిక నిపుణులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇలా నగరాలకు వస్తున్న వారికి ఎక్కువగా ఆలయాలు ఆశ్రయమిస్తున్నాయి. తరు వాత సెక్యూరిటీ గార్డులుగాను, లిఫ్ట్‌బాయ్‌లుగాను వీరు కాలం వెళ్లదీస్తు న్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు జర గడమంటే ఆర్థిక వృద్ధికి అదే సూచిక అని ప్రపంచ బ్యాంకు ప్రవచించింది. దానినే భారత ఆర్థిక నిపుణులు చిలకపలుకుల్లా వల్లిస్తున్నారు. 2013-14 ఆర్థిక సర్వే కూడా ఇదే చెప్పింది. రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ వాదననే ఎలుగెత్తి చాటారు.
 
స్మార్ట్ విలేజ్‌ల సంగతి పట్టదేం!
నరేంద్ర మోడీ ఈ పరిస్థితిని చక్కదిద్దే చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటారని ఆశపడ్డాను. సేద్యం ఆర్థికంగా లాభసాటిగా మార్చాలంటూ ఆయన తన ఎన్నికల సభలలో చాలాసార్లు పేర్కొన్నారు. గ్రామాలకు ఆధునిక సౌకర్యాలు కల్పించడం గురించి కూడా మోడీ పలుసార్లు ప్రస్తావించారు. అభివృద్ధిని గ్రామాలకు తీసుకువెళ్లడమే రాజకీయ చింతనలో మలుపు అవుతుంది. దీనికి శ్రీకారం చుడితేనే వ్యవసాయానికి పునర్‌వైభవం చేకూరి, రైతు ముఖం మీద నవ్వు వెల్లివిరుస్తుంది. వంద స్మార్ట్ నగరాలను నిర్మించాలన్న యోచనతో పాటు స్మార్ట్ గ్రామాల నిర్మాణం గురించి కూడా ప్రధాని దృష్టి పెట్టాలి.
 
స్మార్ట్ విలేజ్ ఏర్పడితే స్థానికంగా జరిగిన ఉత్పత్తికీ, స్థానికంగా జరిగే సేకరణకీ, స్థానికంగా జరిగే పంపిణీకీ మధ్య దానికదే ఒక లంకె ఏర్పడుతుం ది. స్మార్ట్ గ్రామం అనగానే, ఇంటర్నెట్‌తో బంధం ఏర్పడడమే కాదు, సుస్థిర మైన వ్యవసాయ పద్ధతులకు మద్దతు కూడా లభిస్తుంది. చిన్న తరహా పరిశ్ర మలకూ సేద్యానికీ మధ్య కూడా లంకె ఏర్పడుతుంది. రైలు, రోడ్డు మార్గా లతో గ్రామం అనుసంధానమై, విద్య, ఆరోగ్యం వంటి అవసరాలు తీరే మార్గం ఏర్పడుతుంది.
 
అలాంటి మార్పు గురించే దేశం ఎదురుచూస్తోంది కూడా. గ్రామీణ ప్రాంతం అలాంటి రూపురేఖలను సంతరించుకోవాలని గడచిన 67 సంవత్సరాల నుంచి దేశం ఆశిస్తున్నది. స్మార్ట్ గ్రామం పెరిగిపో తున్న ఆర్థిక అసమానతలను తగ్గించడమే కాదు, దేశం నలుమూలలా, మారుమూల ఉన్న ప్రతి వ్యక్తికి మంచి రోజులు తేగలదు. అదే సమయంలో  వలసల కారణంగా పట్టణాల మీద నగరాల మీద పెరుగుతున్న ఒత్తిడిని కూడా స్మార్ట్ గ్రామం తగ్గించగలుగుతుంది.
- దేవేంద్ర శర్మ
వ్యాసకర్త వ్యవసాయ రంగ విశ్లేషకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement