smart villages
-
‘స్మార్ట్’ నివేదికలు సిద్ధం చేయండి
శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లాలోని పలు గ్రామాలను స్మార్ట్ గ్రామాలుగా మా ర్చేందుకు దత్తత తీసుకున్న సంస్థలు, అధికారులు, ఆయా గ్రామాల్లోని సమస్యలపై పూర్తిస్థాయిలో నివేదికలు త యారు చేసి ఇవ్వాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం కోరా రు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం పలు స్వచ్ఛంద సంస్థలు, అధికారులతో స్మార్ట్ గ్రామాల విధి విధానాలపై సమావేశం నిర్వహిచారు. ఎన్ఆర్ఐల ఫండిం గ్‌కి ప్రభుత్వ గ్రాంట్లు 70ః30 నిష్పత్తిలో ఆర్థిక నిధులు చేకూర్చి ఇళ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిలా లో 1100 పంచాయతీలు, 147 వార్డులు ఉండగా, ప్రస్తు తం 563 గ్రామాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. ప్రా ధాన్యతా అంశాల ప్రకారం వీటిని అభివృద్ధి చేయాల న్నా రు. వలసలు లేకుండా చూడాలని, వలసలు నివా రణకు ప్రణాళికలు వేయాలని, అక్కడ వనరులు సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్మార్ట్ గ్రామాల అభివృద్ధిలో వలసల నివారణ ప్రధానమని తెలిపారు. మూడేళ్లలో ఆయా గ్రామాలు అభివృద్ధి చేసేలా చర్యలు తీ సుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సీపీఓ ఎం శివరాంనాయకర్, జెడ్పీ సీఈఓ బి.నగేష్, డీఎంహెచ్ఓ శ్యామల, ఆర్‌డబ్లూఎస్ ఎస్ఈ రవీంద్రనాద్, స్వ చ్ఛంద సంస్థల ప్రతినిధులు నూక సన్యాసిరావు, ఎం.ప్రసాదరావు, ఎస్.నర్సింహమూర్తి తదితరులు ఉన్నారు. -
'స్మార్ట్ విలేజీలకు ఫండింగ్ చేస్తాం'
హైదరాబాద్: ఏపీలో స్మార్ట్ విలేజీలకు నిధుల సహాయం చేస్తామని నాబార్డ్ సీజీఎం హరీష్ చెప్పారు. 2015-16లో రూ.8,301కోట్ల రుణాలు ఇస్తామని చెప్పారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 20శాతం అధికం అని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుకులకు సంబంధించి ఏపీ నుంచి ఇంకా ప్రణాళికలు రావాల్సి ఉందని అన్నారు. -
స్మార్ట్ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ఆత్మకూరు: స్మార్ట్ గ్రామాల అభివృద్ధికి ఉన్నత స్థాయిలో ఉండే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం చేజర్ల మండలం నూతక్కివారికండ్రిక నుంచి ప్రారంభించిన పాదయాత్ర చేజర్ల వరకు(18 కిలోమీటర్లు) సాగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని రెండు ప్రాజెక్ట్‌ల ద్వారా 6 లక్షల ఎకరాల పంటలకు నీరు అందిస్తున్నామని, మరో ఐదేళ్లల్లో 10 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన అనంతరం నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా స్మార్ట్ సిటీ, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూతక్కివారికండ్రిక నుంచి ప్రారంభమైన పాదయాత్రలో కొన్ని సమస్యలను అక్కడికక్కడే తీర్చామన్నారు. ఉన్నత స్థాయిలో ఉండే ఎన్ఆర్ఐలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థల యజమానులు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు వారు జన్మించిన, చదువుకున్న గ్రామాలను ఎంపిక చేసుకుని అభివృద్ధి చేయాలన్నారు. తాను కూడా తాను జన్మించిన జిల్లాలోని తోటపల్లిగూడూరు గ్రామాన్ని, తాను పెరిగిన నెల్లూరు నగరంలోని 18వ వార్డు హరనాథపురా న్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెం దడంలో భాగంగా జిల్లాకు పలు పరిశ్రమలు రానున్నాయన్నారు. పరిశ్రమలు అభివృద్ధి చెందితే యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా అభివృద్ధి చేసేందుకు సీఎం ప్రణాళికలు రూపొందించారన్నారు. ప్రస్తుతం రూ.16 వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో వాస్తవంగా పింఛన్ నగదు పెరుగుదల, రుణమాఫీ సాధ్యంకాని పని అన్నా రు. అయినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పింఛన్ నగదును పెంచడంతోపాటు రైతు ల రుణమాఫీ చేపట్టారన్నారు. త్వరలో డ్వాక్రా రుణాలను కూడా మాఫీ చేస్తారన్నారు. కలెక్టర్ ఎం.జానకి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్మార్ట్ గ్రామాల అభివృద్ధికి సహకరించాలన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దేవాన్, స్మార్ట్ విలేజ్ కార్యక్రమం పరిశీలకులు, రాష్ట్ర చీఫ్ కన్జర్వేట్ ఆఫ్ ఫారెస్ట్ రత్నాకర్ జావీద్ మాట్లాడుతూ గ్రామాలు ప్రాథమిక దశ నుంచే అన్ని రకాల అభివృద్ధి చెందేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములై కృషి చేయాలన్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి మురళీ కన్నబాబు, డీసీసీబీ చైర్మన్ ధనుంజయరెడ్డి ప్రసంగించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు సుందర రామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు సల్మా షరీన్, నాయకులు రాంబాబు, జనార్దన్ నాయుడు, వెంకట సుబ్బానాయుడు, రవీంద్రారెడ్డి, రమేష్‌నాయుడు, మాజీ ఎంపీపీ పెంచలరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులునాయుడు, ఆర్డీఓ ఎం.వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ చంద్రమౌళి, జెడ్పీ సీఈఓ జితేంద్ర పాల్గొన్నారు. -
అధికారికో ఊరు దత్తత
ప్రజాప్రతినిధులు, సినీ తారలు, ఎన్జీవోలు కూడా..: చంద్రబాబు ప్రభుత్వ డబ్బు ఆశించకుండా బాగు చేసే బాధ్యత వారిదే సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారి నుంచి ఎంపీడీవో స్థాయి అధికారి వరకు.., ఎమ్మెల్యే నుంచి మండల పరిషత్ అధ్యక్షుడి వరకు ఒక్కొక్కరు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దాలని సీఎం నారా చంద్రబాబు చెప్పారు. సినిమా తారలు, ఇతర ప్రముఖు లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు కూడా గ్రామాలను దత్తత తీసుకోవాలన్నారు. సంక్రాంతి నుంచే దీనిని ప్రారంభిం చనున్నట్లు తెలిపారు. మంగళవారం సచివాల యం నుంచి నిర్వహించిన వీడియో సమావేశం లో సీఎం ఈ విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం ఆరు నెలల పాలనపై ప్రభుత్వ సలహా దారు పరకాల ప్రభాకర్ రాసిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. సీఎం వెల్లడించిన ఇతర అంశాలు.. - భవిష్యత్‌లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధిదారులకు చెల్లించే సొమ్ము బ్యాంకుల ద్వారానే వెళుతుంది. - ఫిర్యాదులపై ఆన్లైన్లో వెబ్‌పోర్టల్ రూపొం దిస్తున్నాం. అర్జీల పరిష్కారానికి ఏర్పాటయ్యే ఈ పోర్టల్‌కు ‘మీ కోసం’గా పేరు పెడుతున్నాం. - నీటి సంరక్షణకు ప్రాధాన్యత పెరగాలి. వేసవిలో చెరువుల్లో పూడికతీత, కాల్వల మరమ్మతు లు పూర్తికావాలి గోదావరి నదికి వరదలు వచ్చి న సమయంలో సముద్రంలోకి పోయే వృథా నీటినే కృష్ణాకి మళ్లించి, అక్కడి నీటిని రాయలసీమకు అందించేలా చర్యలు తీసుకుంటాం. - రూపాయికి కిలో బియ్యం పంపిణీలో నలుగురు కుటుంబ సభ్యుల పరిమితిని ఎత్తివేసి, ఎంత మంది సభ్యులున్నా ప్రతి వ్యక్తికీ 5 ఐదు కిలోల బియ్యం ఇవ్వబోతున్నాం. పరిశ్రమలకు ప్రత్యేక మండలి ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం ఆదేశం రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు వీలుగా ప్రత్యేక ఆర్థిక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్ ఐపీబీ) సమావేశం సీఎం అధ్యక్షతన జరిగిం ది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చేవారి కి భూములు సమకూర్చడం, పన్ను రాయితీ లు, అనుమతులు త్వరితగతిన మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఆటోమొబైల్, టెక్స్టైల్, ఫుడ్ పార్కులు, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చే అనుమతులు, అభివృద్ధి కోసం ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రక్రియ అమలుకు సింగిల్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. -
స్మార్ట్ విలేజ్ మరింత మేలు
వంద స్మార్ట్ నగరాలను నిర్మించాలన్న యోచనతో పాటు స్మార్ట్ గ్రామాల నిర్మాణం గురించి కూడా ప్రధాని దృష్టి పెట్టాలి. స్మార్ట్ విలేజ్ ఏర్పడితే స్థానికంగా జరిగిన ఉత్పత్తికీ, స్థానికంగా జరిగే సేకరణకీ, స్థానికంగా జరిగే పంపిణీకీ మధ్య దానికదే ఒక లంకె ఏర్పడుతుంది. భారతీయ రైతాంగం అలా ఎప్పుడూ నిర్లక్ష్యానికి ఎందుకు గురౌతూ ఉం టుందో నాకు ఏనాటికీ అర్థం కాని విషయం. చిన్న పాటి వ్యయాలతోనే మన రైతులు పుష్కలంగా పంటలు పండిస్తూ ఉంటారు. ఉత్తేజం కలిగించే విధం గా ఒక ఆర్థిక ప్యాకేజీని కనుక ఇచ్చినట్టయితే, రైతులు ఈ దేశాన్ని ఆహా రంతో, పళ్లూ కూరగాయలతో ముంచెత్తుతారు. అత్యధికంగా వ్యవసాయోత్ప త్తులను ఎగుమతి చేసే దేశంగా భారత్ అవతరించడం ఖాయం. 2013-14 సంవత్సరంలో రైతులు రికార్డు స్థాయిలో 264.4 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలను పండించారు. 4.8 శాతం పెంపుతో చమురు గింజల ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలో 34.5 మిలి యన్ టన్నులకు చేరుకుంది. మొక్కజొన్న కూడా 8.52 శాతం అధికంగా దిగుబడి సాధ్యమైంది. అంటే 24.2 మిలియన్ టన్ను ల మొక్కజొన్న ఉత్పత్తి అయింది. అపరాలు లేదా పప్పుధాన్యా ల ఉత్పత్తి మున్నెన్నడూ లేని రీతిలో 19.6 మిలియన్ టన్నుల దిగుబడిని మన రైతులు సాధ్యం చేశారు. ఇది గతేడాది కంటె 7.10 శాతం ఎక్కువ. పత్తి ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలోనే జరి గింది. వ్యవసాయోత్పత్తులలో ఇంత భారీ పెరుగుదల ఉన్నప్ప టికీ 2013-14 సంవత్సరం వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగా నికి దక్కింది రూ. 19,307 కోట్లు. ఇది మొత్తం ప్రణాళికా వ్య యంలో ఒక్క శాతం కంటె తక్కువ. ఈ బడ్జెట్లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యవసాయం, సహకార విభాగాలకి రూ. 22,652 కోట్లు కేటాయించారు. సేద్యమంటే చిన్న చూపే సేద్యాన్ని నిర్లక్ష్యం చేయడమనే మాట 1991లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టినప్పటి నుంచి వింటున్నాం. అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చి న ప్రసిద్ధ బడ్జెట్ ప్రసంగంలో పారిశ్రామిక రంగం మీద వరాల జల్లు కురిపిం చి, తరువాత పేరాలో మాత్రం ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే మూలాధార మని చెప్పడం నాకింకా గుర్తు. కానీ వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం. అందుకే ఆ రంగానికి అవసరమైన చేయూతను ఇచ్చే బాధ్యతను మన్మోహన్ సింగ్ రాష్ట్రాల మీద పెట్టారు. అప్పుడు ఆయనొక సంగతి విస్మరించారు. పరిశ్రమలు కూడా రాష్ట్ర జాబితాలోనివే. ఆ అంశాన్ని కూడా నాటి కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించి ఉండవలసింది. దీనితో ఆయన పక్షపాత వైఖరి ఎలాంటిదో సుస్పష్టంగానే కనిపిస్తుంది. పదకొండో పంచవర్ష ప్రణాళికా కాలంలో (2007-08 - 2011-12) వ్యవసాయరంగం ఎంతో తృప్తిని కలిగిస్తూ 4.1 శాతం వృద్ధి రేటును సాధిం చింది. అయినప్పటికీ ఆ రంగానికి దక్కినది మరీ ఘోరంగా ఒక లక్ష కోట్లే. ప్రత్యక్షంగా, పరోక్షంగా 60 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగమది. అలాంటి రంగానికి ఐదేళ్లకి గాను లక్ష కోట్లు ఖర్చు చేయడమంటే అది ఏమూ లకి? పన్నెండో పంచవర్ష ప్రణాళిక (2012-13 -- 2017-18)లో ఆ కేటా యింపును రూ. 1.5 లక్షల కోట్లకు పెంచారు. అయితే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగానికి రూ. 5.73 లక్షల కోట్లు పన్ను మినహా యింపును ఇచ్చారు. ఆర్థిక రాడార్ తెర మీద నుంచి రైతులు అదృశ్యమైపో యారని నేను చాలాకాలంగా చెబుతూనే ఉన్నాను. పరిశ్రమలకు పన్ను బాధ లేదు 2004-05 సంవత్సరం నుంచి కార్పొరేట్ భారతానికి రూ. 31 లక్షల కోట్ల మేర పన్ను మినహాయింపు లభించింది. దీనితో ఉత్పత్తి పెరుగుతుందనీ, కొత్త ఉద్యోగాలు వస్తాయనీ అంతా ఆశించారు. అయితే, గడచిన పదేళ్లలో 1.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించారు గానీ, పారిశ్రామికోత్పత్తులలో ఎలాంటి పురోగతీ లేదు. దీనికి పరాకాష్ట ఏమిటంటే- కార్పొరేట్ రంగం రూ. పది లక్షల కోట్ల మిగులును వెనకేసుకోవడం, దాదాపు పది లక్షల కోట్ల రూపా యల మేర బ్యాంకుల రుణాలను (మొండిబకాయిలన్నమాట) ఎగవేయడం. చట్టబద్ధంగా పేదవర్గాలకు రావలసిన ఆర్థిక మద్దతు వారికి ఎలా రాకుండా పోతున్నదో, ఉన్న వనరులను సంపన్న వర్గాలకు ఎలా సౌకర్యంగా మళ్లిస్తున్నారో ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది. వ్యవసాయ రంగం 60 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నదని ఇంత క్రితమే చెప్పుకున్నాం. అందులో 82.2 శాతం చిన్న, మధ్య తరహా రైతులే. వీరికి ఆర్థిక మద్దతు లేకున్నా ఎలా గో నెట్టుకొస్తున్నారు. అయితే 60 శాతం రైతాంగం పస్తులతో బాధ పడుతు న్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యవసాయం ఏమాత్రం లాభసాటి కాని వ్యాపకంగా తయారవుతూ ఉండడంతో 42 శాతం రైతులు సేద్యానికి వీడ్కోలు పలకాలని చూస్తున్నారు. వ్యవసాయం పూర్తిగా నిలిచిపోయి, వ్యవ సాయం మీద ఆధారపడిన వారంతా పట్టణాలకీ నగరాలకీ చేరుకునే విష యం మీద ప్రధాన స్రవంతి ఆర్థిక నిపుణులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇలా నగరాలకు వస్తున్న వారికి ఎక్కువగా ఆలయాలు ఆశ్రయమిస్తున్నాయి. తరు వాత సెక్యూరిటీ గార్డులుగాను, లిఫ్ట్బాయ్లుగాను వీరు కాలం వెళ్లదీస్తు న్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు జర గడమంటే ఆర్థిక వృద్ధికి అదే సూచిక అని ప్రపంచ బ్యాంకు ప్రవచించింది. దానినే భారత ఆర్థిక నిపుణులు చిలకపలుకుల్లా వల్లిస్తున్నారు. 2013-14 ఆర్థిక సర్వే కూడా ఇదే చెప్పింది. రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ వాదననే ఎలుగెత్తి చాటారు. స్మార్ట్ విలేజ్ల సంగతి పట్టదేం! నరేంద్ర మోడీ ఈ పరిస్థితిని చక్కదిద్దే చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటారని ఆశపడ్డాను. సేద్యం ఆర్థికంగా లాభసాటిగా మార్చాలంటూ ఆయన తన ఎన్నికల సభలలో చాలాసార్లు పేర్కొన్నారు. గ్రామాలకు ఆధునిక సౌకర్యాలు కల్పించడం గురించి కూడా మోడీ పలుసార్లు ప్రస్తావించారు. అభివృద్ధిని గ్రామాలకు తీసుకువెళ్లడమే రాజకీయ చింతనలో మలుపు అవుతుంది. దీనికి శ్రీకారం చుడితేనే వ్యవసాయానికి పునర్వైభవం చేకూరి, రైతు ముఖం మీద నవ్వు వెల్లివిరుస్తుంది. వంద స్మార్ట్ నగరాలను నిర్మించాలన్న యోచనతో పాటు స్మార్ట్ గ్రామాల నిర్మాణం గురించి కూడా ప్రధాని దృష్టి పెట్టాలి. స్మార్ట్ విలేజ్ ఏర్పడితే స్థానికంగా జరిగిన ఉత్పత్తికీ, స్థానికంగా జరిగే సేకరణకీ, స్థానికంగా జరిగే పంపిణీకీ మధ్య దానికదే ఒక లంకె ఏర్పడుతుం ది. స్మార్ట్ గ్రామం అనగానే, ఇంటర్నెట్తో బంధం ఏర్పడడమే కాదు, సుస్థిర మైన వ్యవసాయ పద్ధతులకు మద్దతు కూడా లభిస్తుంది. చిన్న తరహా పరిశ్ర మలకూ సేద్యానికీ మధ్య కూడా లంకె ఏర్పడుతుంది. రైలు, రోడ్డు మార్గా లతో గ్రామం అనుసంధానమై, విద్య, ఆరోగ్యం వంటి అవసరాలు తీరే మార్గం ఏర్పడుతుంది. అలాంటి మార్పు గురించే దేశం ఎదురుచూస్తోంది కూడా. గ్రామీణ ప్రాంతం అలాంటి రూపురేఖలను సంతరించుకోవాలని గడచిన 67 సంవత్సరాల నుంచి దేశం ఆశిస్తున్నది. స్మార్ట్ గ్రామం పెరిగిపో తున్న ఆర్థిక అసమానతలను తగ్గించడమే కాదు, దేశం నలుమూలలా, మారుమూల ఉన్న ప్రతి వ్యక్తికి మంచి రోజులు తేగలదు. అదే సమయంలో వలసల కారణంగా పట్టణాల మీద నగరాల మీద పెరుగుతున్న ఒత్తిడిని కూడా స్మార్ట్ గ్రామం తగ్గించగలుగుతుంది. - దేవేంద్ర శర్మ వ్యాసకర్త వ్యవసాయ రంగ విశ్లేషకులు