ప్రజాప్రతినిధులు, సినీ తారలు, ఎన్జీవోలు కూడా..: చంద్రబాబు
ప్రభుత్వ డబ్బు ఆశించకుండా బాగు చేసే బాధ్యత వారిదే
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారి నుంచి ఎంపీడీవో స్థాయి అధికారి వరకు.., ఎమ్మెల్యే నుంచి మండల పరిషత్ అధ్యక్షుడి వరకు ఒక్కొక్కరు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దాలని సీఎం నారా చంద్రబాబు చెప్పారు. సినిమా తారలు, ఇతర ప్రముఖు లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు కూడా గ్రామాలను దత్తత తీసుకోవాలన్నారు. సంక్రాంతి నుంచే దీనిని ప్రారంభిం చనున్నట్లు తెలిపారు. మంగళవారం సచివాల యం నుంచి నిర్వహించిన వీడియో సమావేశం లో సీఎం ఈ విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం ఆరు నెలల పాలనపై ప్రభుత్వ సలహా దారు పరకాల ప్రభాకర్ రాసిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.
సీఎం వెల్లడించిన ఇతర అంశాలు..
- భవిష్యత్‌లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధిదారులకు చెల్లించే సొమ్ము బ్యాంకుల ద్వారానే వెళుతుంది.
- ఫిర్యాదులపై ఆన్‌లైన్‌లో వెబ్‌పోర్టల్ రూపొం దిస్తున్నాం. అర్జీల పరిష్కారానికి ఏర్పాటయ్యే ఈ పోర్టల్‌కు ‘మీ కోసం’గా పేరు పెడుతున్నాం.
- నీటి సంరక్షణకు ప్రాధాన్యత పెరగాలి. వేసవిలో చెరువుల్లో పూడికతీత, కాల్వల మరమ్మతు లు పూర్తికావాలి గోదావరి నదికి వరదలు వచ్చి న సమయంలో సముద్రంలోకి పోయే వృథా నీటినే కృష్ణాకి మళ్లించి, అక్కడి నీటిని రాయలసీమకు అందించేలా చర్యలు తీసుకుంటాం.
- రూపాయికి కిలో బియ్యం పంపిణీలో నలుగురు కుటుంబ సభ్యుల పరిమితిని ఎత్తివేసి, ఎంత మంది సభ్యులున్నా ప్రతి వ్యక్తికీ 5 ఐదు కిలోల బియ్యం ఇవ్వబోతున్నాం.
పరిశ్రమలకు ప్రత్యేక మండలి
ఎస్‌ఐపీబీ సమావేశంలో సీఎం ఆదేశం
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు వీలుగా ప్రత్యేక ఆర్థిక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్ ఐపీబీ) సమావేశం సీఎం అధ్యక్షతన జరిగిం ది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చేవారి కి భూములు సమకూర్చడం, పన్ను రాయితీ లు, అనుమతులు త్వరితగతిన మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఆటోమొబైల్, టెక్స్‌టైల్, ఫుడ్ పార్కులు, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చే అనుమతులు, అభివృద్ధి కోసం ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రక్రియ అమలుకు సింగిల్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు.
అధికారికో ఊరు దత్తత
Published Wed, Dec 10 2014 2:15 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM
Advertisement
Advertisement