సాక్షి, అమరావతి: ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కూటమి రాజ్యాంగం నడుస్తోంది. కారణం లేకుండానే ప్రభుత్వ అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కథలు చెప్పొద్దు అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు.
ఇక, తాజాగా సమీక్ష సందర‍్బంగా చంద్రబాబు.. ఐఏఎస్ అధికారి సునీతపై అసహనం వ్యక్తం చేశారు. అయితే, సమీక్షలో భాగంగా చంద్రబాబు పలువురు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈనెల ఏడో తేదీన చేనేత దినోత్సవం చీరాలలో నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా చేనేత జౌళి శాఖ కార్యదర్శి ఐఏఎస్ సునీత కల్పించుకుని విజయవాడలో నిర్వహించాలని కోరారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయారు చంద్రబాబు.
అనంతరం చంద్రబాబు.. చీరాలలో పెట్టమంటే విజయవాడలో ఎందుకు నిర్వహించమంటున్నావ్?. నీకు చీరాల రావడానికి ఏదైనా ఇబ్బంది ఉందా?. విజయవాడలో పెట్టమని ఎవరు చెప్పారు? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అధికారి సునీత మాట్లాడుతూ.. అదే రోజున కేబినెట్ ఉందని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు.. అయితే చేనేత దినోత్సవాన్ని చీరాలలోనే మధ్యాహ్నం కొనసాగించండి. అంతేకానీ, అంతా మీ ఇష్టం కాదు అంటూ మండిపడ్డారు.
మరోవైపు.. ఇరిగేషన్ శాఖలో పనులు వేగంగా జరుగుతున్నాయని, మంత్రి రామానాయుడు ఎక్కువసేపు అందుబాటులో ఉంటున్నారని ప్రిన్సిపాల్ సెక్రటరీ సాయి ప్రసాద్ చెప్పుకొచ్చారు. మంత్రి సెక్రటరీలా.. సెక్రటరీ మంత్రిలా పనిచేస్తున్నారని అన్నారు. దీంతో, చంద్రబాబు.. కథలు చెప్పొదు అంటూ సాయి ప్రసాద్‌కు చురకలంటించారు. ఎవరూ ఎక్కువ మాట్లాడాల్సిన పనిలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. చంద్రబాబు సీఎంగా బాధ్యతల స్వీకరణ తర్వాత ఏపీలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి కూడా బొకేను అందించారు. ఆమె బొకే ఇస్తే చంద్రబాబు తీసుకోవడానికి తిరస్కరించారు. ఈ సమయంలో చంద్రబాబు తీరును కొందరు మాజీ ఐఏఎస్‌లు ఖండించారు. సీఎం స్థానంలో ఉండి అధికారుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది అంటూ ప్రశ్నించారు. వారిని అవమానించడం కరెక్ట్ కాదంటూ హితవు పలికారు.
ఇక, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆఘమేఘాల మీద ఆయన్ని కేంద్ర సర్వీసుల నుంచి పీయూష్ కుమార్‌ను రప్పించుకుంది. ఇప్పుడు సీఎంవోలో ఎలాంటి శాఖలు అప్పగించకుండా ఖాళీగా కూర్చోబెట్టింది. దీంతో ఏ శాఖా కేటాయింపు లేకుండానే ఆయన సీఎంవోలో కూర్చుకున్నారు. మరోవైపు.. కావాలనే ఆయన్ని అవమానిస్తున్నారేమో? అని సీఎంవో అధికారులు గుసగుసలాడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment