శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లాలోని పలు గ్రామాలను స్మార్ట్ గ్రామాలుగా మా ర్చేందుకు దత్తత తీసుకున్న సంస్థలు, అధికారులు, ఆయా గ్రామాల్లోని సమస్యలపై పూర్తిస్థాయిలో నివేదికలు త యారు చేసి ఇవ్వాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం కోరా రు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం పలు స్వచ్ఛంద సంస్థలు, అధికారులతో స్మార్ట్ గ్రామాల విధి విధానాలపై సమావేశం నిర్వహిచారు. ఎన్‌ఆర్‌ఐల ఫండిం గ్‌కి ప్రభుత్వ గ్రాంట్లు 70ః30 నిష్పత్తిలో ఆర్థిక నిధులు చేకూర్చి ఇళ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిలా లో 1100 పంచాయతీలు, 147 వార్డులు ఉండగా, ప్రస్తు తం 563 గ్రామాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు.
ప్రా ధాన్యతా అంశాల ప్రకారం వీటిని అభివృద్ధి చేయాల న్నా రు. వలసలు లేకుండా చూడాలని, వలసలు నివా రణకు ప్రణాళికలు వేయాలని, అక్కడ వనరులు సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్మార్ట్ గ్రామాల అభివృద్ధిలో వలసల నివారణ ప్రధానమని తెలిపారు. మూడేళ్లలో ఆయా గ్రామాలు అభివృద్ధి చేసేలా చర్యలు తీ సుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సీపీఓ ఎం శివరాంనాయకర్, జెడ్పీ సీఈఓ బి.నగేష్, డీఎంహెచ్‌ఓ శ్యామల, ఆర్‌డబ్లూఎస్ ఎస్‌ఈ రవీంద్రనాద్, స్వ చ్ఛంద సంస్థల ప్రతినిధులు నూక సన్యాసిరావు, ఎం.ప్రసాదరావు, ఎస్.నర్సింహమూర్తి తదితరులు ఉన్నారు.
‘స్మార్ట్’ నివేదికలు సిద్ధం చేయండి
Published Wed, May 18 2016 9:15 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement