టాప్-20లో హైదరాబాద్ను నిలబెడదాం | GHMC commissioner somesh kumar review meeting on smart city report | Sakshi
Sakshi News home page

టాప్-20లో హైదరాబాద్ను నిలబెడదాం

Published Mon, Sep 21 2015 8:26 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

టాప్-20లో హైదరాబాద్ను నిలబెడదాం - Sakshi

టాప్-20లో హైదరాబాద్ను నిలబెడదాం

హైదరాబాద్ :  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 100 స్మార్ట్ సిటిల్లో హైదరాబాద్ నగరాన్ని టాప్-20లో నిలిపేందుకు జీహెచ్ఎంపీ ప్రణాళికలు రూపొందిస్తోందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. కేంద్రానికి ఇచ్చే నివేదికపై జీహెచ్ఎంసీ సీనియర్ అధికారులు, కన్సల్టెంట్తో ఆయన సోమవారమిక్కడ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రానికి పంపే స్మార్ట్ సిటీ నివేదికను ఉత్తమ ప్రమాణాలతో రూపొందించాలని, జీహెచ్ఎంసీ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాలను నివేదికలో పొందుపరచాలన్నారు.

హైదరాబాద్ను విశేష నగరంగా రూపొందించేందుకు కార్యక్రమాలు సూచించాలని, హెరిటేజ్ పరిరక్షణ, హరిత హైదరాబాద్, పరిశుభ్ర హైదరాబాద్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ గవర్నన్స్, సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా నిర్వహణపై చేపట్టాల్సిన చర్యలను సూచిస్తూ నివేదిక రూపొందించాలన్నారు.  ఈ సమీక్షా సమావేశంలో సీసీపీ దేవందర్ రెడ్డి, అదనపు కమిషనర్లు కెనడీ, శంకరయ్యతో పాటు పలువురు కన్సల్టెంట్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement