భారతదేశంలో స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయడానికి తాము సాయం చేస్తామంటూ సింగపూర్ ముందుకొచ్చింది. వాటితో పాటు పట్టణాభివృద్ధికి సంబంధించిన ఇతర ప్రాజెక్టులలోనూ భాగస్వామ్యం వహిస్తామంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణంలో కూడా పాలు పంచుకునేందుకు ఆసక్తి చూపింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో జిరగిన సమావేశాల్లో సింగపూర్ అగ్ర నాయకులు ఈ విషయాలను వెల్లడించారు.
సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ను వెంకయ్యనాయుడు కలిశారు. ప్రస్తుతం సింగపూర్లో ఉన్న ఆయన.. దక్షిణ కొరియాలోని సియోల్లో ఆసియా పసిఫిక్ మంత్రుల సదస్సులో పాల్గొన్న తర్వాత ఢిల్లీకి తిరిగి వస్తారు. భారతదేశంలో మొత్తం వంద స్మార్ట్ సిటీలను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశంలో శరవేగంగా సాగుతున్న అభివృద్ధి, ఆయన చొరవను సింగపూర్ ప్రధాని, మాజీ ప్రధాని కూడా అభినందించారు.
మన స్మార్ట్ సిటీలకు సింగపూర్ సాయం
Published Thu, Nov 6 2014 8:06 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM
Advertisement