అప్నా సిటీ నం.1 | Smart Cities In The World Hyderabad Gets 67th Rank | Sakshi
Sakshi News home page

అప్నా సిటీ నం.1

Published Sat, Oct 5 2019 4:43 AM | Last Updated on Sat, Oct 5 2019 4:43 AM

Smart Cities In The World Hyderabad Gets 67th Rank - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మన భాగ్యనగరం అరుదైన గుర్తింపు పొందింది. టాప్‌100 స్మార్ట్‌నగరాల జాబితాలో మన దేశం నుంచి మూడు నగరాలకు చోటు దక్కగా వాటిల్లో హైదరాబాద్‌ ముందుంది. స్మార్ట్‌ నగరాల జాబితాలో గ్రేటర్‌ హైదరాబాద్‌ విశ్వవ్యాప్తంగా 67వ ర్యాంకును దక్కించుకుంది. దేశరాజధాని ఢిల్లీ 68వ స్థానం, ముంబై 78వ స్థానం దక్కించుకోవడం గమనార్హం. విశ్వవ్యాప్తంగా బెస్ట్‌ స్మార్ట్‌సిటీగా సింగపూర్‌ నిలవగా రెండోస్థానంలో జూరిచ్, మూడోస్థానంలో ఓస్లో, నాలుగోస్థానంలో జెనీవా, ఐదో స్థానంలో కొపెన్‌హెగెన్‌ నగరాలు నిలిచినట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని స్విట్జర్లాండ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్, సింగపూర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ డిజైన్‌ సంస్థలు 102 నగరాలపై అధ్యయనం నిర్వహించిన అనంతరం ఈ ర్యాంక్‌లను ప్రకటించాయి.  

పౌర సేవలను బట్టి ర్యాంకులు 
102 నగరాలను 4 గ్రూపులుగా విభజించామని, ఆయా నగరాల్లో స్మార్ట్‌టెక్నాలజీ వినియోగం, పౌరులకు అందుతున్న సేవలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్‌లు ఇచి్చనట్లు నిర్వాహకు లు తెలిపారు. ఈ ర్యాంకింగ్‌ల ప్రకారం హైదరాబాద్, న్యూఢిల్లీ నగరాలు ‘సీసీసీ’, ముంబై ‘సీసీ’రేటింగ్‌ పొందాయన్నారు. ఈ జాబితాలో అగ్రభాగాన నిలిచిన సింగపూర్, జూరిచ్‌ నగరాలు ‘ఏఏఏ’ర్యాంకింగ్‌ సాధించాయన్నారు. ఈ జాబితా రూపొందిం చిన ఐఎండీ సంస్థ అధ్యక్షుడు బ్రూనో లెని్వన్‌ వివరణనిస్తూ విశ్వవ్యాప్తంగా స్మార్ట్‌నగరాలు పలు రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ముందుంటున్నాయన్నారు.

విదేశీ బహుళజాతి సంస్థలు స్మార్ట్‌సిటీల్లో తమ వ్యాపార ప్రణాళికలను విస్తరించేందుకు ముందుకొస్తున్నాయన్నారు. నగరపాలక సంస్థలు పౌరులకు అందిస్తున్న ఆన్‌లైన్‌ సేవలు, ఇంటిపన్నులు, నల్లాబిల్లులు, పారిశుద్ధ్యం, ఇతర సమస్యలపై ఆన్‌లైన్‌ ఫిర్యాదుల స్వీక రణ, వాటిని పరిష్కరిస్తున్న తీరు, తిరిగి పౌరులకు అందిస్తున్న ఫీడ్‌బ్యాక్‌ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. స్మార్ట్‌ మొబైల్‌యాప్‌ల సృజన, వాటికి లభిస్తున్న ఆదరణను కూడా పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. 

సూపర్‌ సింగపూర్‌  
సింగపూర్‌లో పౌరుల భద్రత , మెరుగైన ప్రజారవాణా, ట్రాఫిక్‌ రద్దీని నియంత్రిం చే చర్యలు, ఆక్సీజన్‌ అందించేందుకు తీసుకుంటున్న చర్యలు అత్యద్భుతంగా ఉండడంతోనే ఈ సిటీ ఈ జాబితాలో అగ్రభాగాన నిలిచిందని బ్రూనో లెని్వన్‌ తెలిపారు. జూరిచ్‌లోనూ ప్రజారవా ణా, స్మార్ట్‌బైక్‌ల వినియోగాన్ని పెంచడం వంటి మె రుగైన అంశాల కారణం గా ఈ సిటీ 2వస్థానం దక్కించుకుందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement