అమరావతిలో స్మార్ట్‌సిటీకి మా సపోర్ట్: బ్రిటన్
- పుణె, ఇండోర్‌లో కూడా..
న్యూఢిల్లీ: పుణె, ఇండోర్, అమరావతి నగరాల్లో స్మార్ట్‌సిటీల అభివృద్ధికి మద్దతునిస్తామని తమ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిందని బ్రిటన్ అంతర్జాతీయ వ్యవహారాల సహాయ సెక్రటరీ ప్రీతి పటేల్ తెలిపారు. పట్టణాభివృద్ధి, స్మార్ట్‌సిటీల అభివృద్ధి విషయమై భారత్-బ్రిటన్ పరస్పర సహకారంతో ముందుకెళుతున్నాయని చెప్పారు. భారత పర్యటనకు వచ్చిన ఆమె శనివారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మట్లాడుతూ.. మోదీని కలువడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆమె చెప్పారు. భారత్-బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి గురించి తాను ప్రధాని మోదీతో చర్చించినట్టు తెలిపారు.
ప్రధాని మోదీ ఆర్థిక సంస్కరణల ఎజెండాకు బ్రిటన్ మద్దతు తెలుపుతున్నట్టు తెలిపారు. భారత్‌లోని పెద్ద ప్రాజెక్టులకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో బాండ్‌లు జారీచేయడం ద్వారా లండన్ నగరం ఆర్థిక సహకారం అందజేస్తున్నదని ప్రీతి పటేల్ చెప్పారు. ఆదివారం బోఫాల్‌లో పర్యటించి మధ్యప్రదేశ్ సీఎంతో భేటీ అవుతానని, ఈ భేటీలో పట్టణాభివృద్ధి గురించి చర్చిస్తామని ఆమె తెలిపారు. ఉగ్రవాద నిరోధం విషయంలో భారత్-బ్రిటన్ భుజంభుజం కలిపి ముందుకుసాగుతున్నాయన్నారు.
British Govt has given indication of support for smart cities development in Pune, Indore, Amravati: Priti Patel pic.twitter.com/rbfSF4insW
— ANI (@ANI_news) 13 August 2016