British Govt
-
పీడిత ప్రజల విముక్తి కోసం...
కమ్యూనిస్టు విప్లవోద్యమ అగ్రనాయకుల్లో ఒకరైన కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి రహస్యజీవితం గడుపుతూ 1976 జూలై 28న అనారోగ్యంతో అమరులయ్యారు. భారత విప్లవ రాజకీయ రంగంలో 35 ఏళ్లకు పైగా వెలుగొంది ‘టీఎన్’గా సుపరిచితులై పీడిత ప్రజల హృదయాలలో ఆయన శాశ్వత స్థానం సంపాదించారు.కా‘‘ తరిమెల నాగిరెడ్డి 1917 ఫిబ్రవరి 11న అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో పుట్టారు. తాను భూస్వామ్య కుటుంబంలో జన్మించినా దేశంలో కొనసాగుతున్న ఫ్యూడల్ దోపిడీ వ్యవస్థను భూస్థాపితం చేయటానికి, దోపిడీ పీడనలులేని సమ సమాజస్థాపనకు తన సర్వస్వాన్ని అర్పించి దేశవ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందారు.విద్యార్థి దశలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. బెనారసు విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘానికి అధ్యక్షునిగా 1939లో ఎన్నికైన తొలి ఆంధ్రుడు ఈయనే. బెనారసు విశ్వవిద్యాలయంలోనే కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. లా చదువుకు స్వస్తిచెప్పి ఎం.ఏ. పట్టాతో విశ్వవిద్యాలయాన్ని వదలగానే యువకులను ఉద్యమాల్లోకి సమీకరించే కృషిని ప్రారంభించారు. కార్మికులు, రైతాంగం కొరకు ఉద్యమించారు. 1940లో ‘యుద్ధం దాని ఆర్థిక ప్రభావం’ అన్న చిన్న పుస్తకాన్ని ప్రచురించి నందుకు 23 ఏండ్ల యువకునిగా ఉన్నప్పుడే బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షను అనుభవించారు.తన కంచుకంఠంతో పండిత పామరులను ఉర్రూతలూగించి కమ్యూనిస్టు విప్లవ రాజకీయాలను దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటులో ఆయన ఉపన్యాసాలను అధికార, ప్రతిపక్ష సభ్యులు ఆసక్తితో, శ్రద్ధతో వినేవారు. భారత విప్లవోద్యమ రంగంలో కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు (డీవీ)తో కలిసి మనదేశ పీడిత ప్రజల విముక్తికి అవసరమైన సరైన విప్లవపంథాను రూపకల్పన చేయడంలో, ఈ విప్లవ పంథాను దేశమంతటా ప్రచారంచేసి వ్యాపింపచేయటంలో టీఎన్ చారిత్రాత్మకమైన పాత్ర నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన పాలకుల తీవ్రనిర్బంధానికి గురయ్యారు. అరెస్టులు, జైలుశిక్షలు, అజ్ఞాతవాసాలకు వెరువలేదు. ఆయనపైనా, మరో 60మందిపైనా పెట్టిన కుట్రకేసు విచారణ సందర్భంగా జైలులో ఉన్నపుడు (1970–72) ఆయన భారత ఆర్థిక వ్యవస్థపై ‘తాకట్టులో భారతదేశం’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. దానిని కోర్టులో ఒక ప్రకటన రూపంలో చదివారు. సరైన మార్క్సిస్టు లెనినిస్టు విశ్లేషణతో ఆ పుస్తకంలో ఆయన చేసిన నిర్ధారణలు నేటికీ అక్షరసత్యాలే. అవి కమ్యూనిస్టు విప్లవకారులకు, ప్రజాతంత్రశక్తులకూ భావి కార్యాచరణకు మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి.1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తన బావ సంజీవరెడ్డిని ఓడించి అనంతపురం శాసనసభ్యునిగా తొలిసారిగా ఎన్నికయ్యారు. 35 ఏళ్ళ వయస్సులోనే మద్రాసు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా తన రాజకీయ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించారు. 1969 మార్చిలో తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామాచేసి అసెంబ్లీలో సంచలనాత్మకమైన ఉపన్యాసాన్ని ఇచ్చారు. పాలకవర్గాలు దేశాన్ని విదేశీ పెట్టుబడిదారులకు తాకట్టు పెడ్తూ వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విధానాలను, భూస్వాముల ప్రయోజనాలను పరిరక్షించే విధానాలను అనుసరిస్తున్నారని అన్నారు. దేశాభివృద్ధికంటే రక్షణ చర్యలకే ప్రాధాన్యతనిస్తూ పెరుగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని నివారించే చర్యలను అసెంబ్లీ, పార్లమెంటు చేపట్టకుండా ఈ సంక్షోభ తీవ్రతను మరింతగా పెంచే ప్రజావ్యతిరేక విధానాలను అవి అవలంబిస్తున్నాయని చెప్తూ ‘‘జనాల్ని కదిలిస్తే తప్ప పాలకుల దోపిడీ, దౌర్జన్యాలు అంతం’’ కావని వ్యాఖ్యానించారు. 1975లో డీవీతో కలిసి యూసీసీఆర్ఐ (ఎమ్ఎల్) ను స్థాపించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తన జీవితకాలమంతటా అత్యున్నత విప్లవ ప్రమాణాలను పాటించారు. ఆయన స్మృతి నిరంతరం ప్రజలను విప్లవ కర్తవ్యోన్ముఖులను చేస్తూనే వుంటుంది. సి. భాస్కర్ ‘ యూసీసీఆర్ఐ (ఎమ్ఎల్) -
సంస్థానాల రేడియో... బ్రిటిష్ కనుసన్నల్లోనే!
తొలుత బ్రిటిష్ ప్రభుత్వం రేడియో ప్రసారాల పట్ల ఆసక్తి చూప లేదు. కానీ 1927 నుంచీ తన ధోరణిని మార్చు కున్నది. ఒకవైపు పరికరాల దిగుమతి, మరోవైపు రేడియో లైసెన్సుల జారీ తమ అధీనంలోనే పెట్టు కుని... ప్రసారాల నియంత్రణ, సెన్సార్షిప్, ప్రభుత్వ వ్యతిరేకులు రేడియో వినియోగించక పోవడం వంటి అంశాల పట్ల దృష్టి ఎక్కువగానే పెట్టింది. అదే సమయంలో వివిధ సంస్థానాలలో రేడియోపట్ల ఆసక్తి చూపినవారికి అడ్డు చెప్పలేదు. కేవలం హైదరాబాద్, మైసూరు, బరోడా, తిరువాన్కూరు సంస్థానాలలో మాత్రమే రేడియో ప్రసారాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ సంస్థా నాల రేడియో ప్రసారాలకు సంబంధించి హైదరా బాద్ కొంచెం విభిన్నంగా కనబడుతోంది. నిజాం స్వాధీనం చేసుకున్న, ‘నిజాం రేడియో’ లేదా ‘దక్కన్ రేడియో’గా పేరుగాంచిన కేంద్రం 1935 ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 411 మీటర్లపై పని చేయడం మొదలు పెట్టింది. మరే సంస్థానానికీ లేని రీతిన నిజాం రేడియోకు రెండవ ట్రాన్స్ మీటరు ఔరంగాబాద్ నుంచి పనిచెయ్యడం అదే సంవత్సరంలో కొంతకాలం తర్వాత మొదలైంది. హైదరాబాద్ తర్వాత మొదలైంది మైసూరులో సైకాలజీ ప్రొఫెసర్ డా. ఎమ్వీ గోపాల స్వామి ప్రారంభించిన 30 వాట్ల రేడియో ట్రాన్స్ మీటర్. వీరి నిర్వహణలోనే అది 1935 సెప్టెంబర్ 10 నుంచీ 1942 దాకా నడిచి, పిమ్మట మైసూరు సంస్థానం చెప్పుచేతల్లోకి వచ్చింది. మైసూరు సంస్థానం రేడియోకు సంబంధించి ఒక ప్రత్యేకత వుంది. ఆ రేడియో కేంద్రాన్ని వారు ‘ఆకాశవాణి’ అని వ్యవహరించేవారు. బ్రిటిష్‌వాళ్ల నిర్వహణలో సాగే రేడియోకు ‘ఆలిండియా రేడియో’ అని 1936 జూన్ 8న నామ కరణం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1958లో ఆలిండియా రేడియోకు ‘ఆకాశవాణి’ అనే పేరును కూడా స్వీకరించారు. హైదరాబాద్, ఔరం గాబాద్, మైసూరులలో రేడియో ప్రసారాలు ప్రారంభమైన పిదప 1943 మార్చి 12న తిరువా న్కూరు సంస్థానం (తిరువనంతపురం)లో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. బరోడా బ్రాడ్ కాస్టింగ్ స్టేషన్ పేరున రేడియో కేంద్రానికి 1939 మే 1వ తేదీన బరోడా సంస్థా నంలో పునాదిరాయి వేసినట్టు తెలుస్తోంది. ప్రసా రాలు ఎప్పుడు మొదలయ్యాయో సమాచారం పూర్తిగా అందుబాటులో లేదు గానీ, బీబీసీలో పని చేసిన నారాయణ మీనన్ 1947లో ఈ రేడియో స్టేషన్లో పనిచేశారు. వీరే తరువాతి కాలంలో ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్‌గా 1965–68 మధ్య కాలంలో పనిచేశారు. హైదరాబాద్, ఔరం గాబాద్, మైసూరు, తిరువాన్కూరు, బరోడా రేడియో కేంద్రాల ప్రసారాలు బ్రిటిష్ పాలకులకు అనువుగానే సాగాయి. ఇంతవరకూ చర్చించిన రేడియో ప్రసారాలు స్వాతంత్య్రోద్యమానికిగానీ, ఉద్యమంలో పాల్గొన్న ప్రజలకు గానీ తోడ్పడిన సందర్భాలు దాదాపు లేవు. 1932లో బొంబాయి స్టేషన్ డైరెక్టర్ ప్రకారం... ఏదో ఒక రేడియో కేంద్రం స్వాతంత్య్రో ద్యమానికి అనుకూలంగా పనిచేస్తున్నట్టు... విన బడిన ప్రసారాల వల్ల తెలుస్తోందని ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొన్నారని పార్థసారథి గుప్తా... ‘రేడియో అండ్ ది రాజ్ 1921–47’(1995) పుస్తకంలో పేర్కొన్నారు. నాలుగు సంస్థానాలలో బరోడా రేడియో కేంద్రాన్ని స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం 1948 డిసెంబరు 16న తన అజమా యిషీలోకి తీసుకున్నది. హైదరాబాద్, ఔరంగా బాద్, మైసూరు, తిరువాన్కూరు కేంద్రాలన్నీ 1950 ఏప్రిల్ 1వ తేదీన భారతదేశ ప్రభుత్వం అధీనంలోకి వచ్చి ఆలిండియా రేడియోగా కొనసా గాయి. ఔరంగాబాద్ కేంద్రం కొంతకాలం ఆలిం డియా రేడియోగా పనిచేసి 1953లో మూత పడింది. పాలకులకు పూర్తిగా దోహదపడిన చరిత్ర కలిగిన రేడియో ప్రసారాలుగా ఇవి మిగిలి పోయాయి. డా. నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి విశ్రాంత ఉన్నతోద్యోగి మొబైల్: 94407 32392 -
అమరావతిలో స్మార్ట్‌సిటీకి మా సపోర్ట్: బ్రిటన్
పుణె, ఇండోర్‌లో కూడా.. న్యూఢిల్లీ: పుణె, ఇండోర్, అమరావతి నగరాల్లో స్మార్ట్‌సిటీల అభివృద్ధికి మద్దతునిస్తామని తమ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిందని బ్రిటన్ అంతర్జాతీయ వ్యవహారాల సహాయ సెక్రటరీ ప్రీతి పటేల్ తెలిపారు. పట్టణాభివృద్ధి, స్మార్ట్‌సిటీల అభివృద్ధి విషయమై భారత్-బ్రిటన్ పరస్పర సహకారంతో ముందుకెళుతున్నాయని చెప్పారు. భారత పర్యటనకు వచ్చిన ఆమె శనివారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మట్లాడుతూ.. మోదీని కలువడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆమె చెప్పారు. భారత్-బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి గురించి తాను ప్రధాని మోదీతో చర్చించినట్టు తెలిపారు. ప్రధాని మోదీ ఆర్థిక సంస్కరణల ఎజెండాకు బ్రిటన్ మద్దతు తెలుపుతున్నట్టు తెలిపారు. భారత్‌లోని పెద్ద ప్రాజెక్టులకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో బాండ్లు జారీచేయడం ద్వారా లండన్ నగరం ఆర్థిక సహకారం అందజేస్తున్నదని ప్రీతి పటేల్ చెప్పారు. ఆదివారం బోఫాల్‌లో పర్యటించి మధ్యప్రదేశ్ సీఎంతో భేటీ అవుతానని, ఈ భేటీలో పట్టణాభివృద్ధి గురించి చర్చిస్తామని ఆమె తెలిపారు. ఉగ్రవాద నిరోధం విషయంలో భారత్-బ్రిటన్ భుజంభుజం కలిపి ముందుకుసాగుతున్నాయన్నారు. British Govt has given indication of support for smart cities development in Pune, Indore, Amravati: Priti Patel pic.twitter.com/rbfSF4insW — ANI (@ANI_news) 13 August 2016