సాక్షి, గుంటూరు : మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. అనుమతి లేకుండా ర్యాలీలు చేయవద్దన్నందుకు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. పోలీసులుపై టీడీపీ నేతలు రౌడీయిజం చేశారు. నిలువరించేందుకు యత్నించిన కానిస్టేబుళ్లపై సైతం దాడి చేశారు. (చదవండి: బిల్లులపై మండలిలో రగడ)
కాగా అన్ని ప్రాంతాల అభివృద్ధిని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు కృష్ణా, గుంటూరు జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే రెండు జిల్లాల్లో ఎక్కడా బంద్ ప్రభావం కనబడటం లేదు. రాజధాని ప్రాంతంలోనూ టీడీపీ నేతల బంద్‌కు స్పందన కరువైంది. ఓ వైపు ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. మరోవైపు స్కూళ్లు, కాలేజీలు, దుకాణాలు తెరుచుకున్నాయి. ఇక అసెంబ్లీ పరిసరాల్లో చొరబడిన అసాంఘిక శక్తుల కోసం సెర్చ్ కొనసాగుతోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. (చదవండి: మండలిలో టీడీపీ సైంధవ పాత్ర)
అలాగే అమరావతి జేఏసీ ఇచ్చిన కృష్ణా, గుంటూరు జిల్లాల బంద్ పిలుపు ప్రభావం మచిలీపట్నంలో ఎక్కడా కనిపించడం లేదు. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. ఇక నూజివీడు పట్టణంలోనూ బంద్ ప్రభావం ఏమాత్రం లేదు. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు యథావిధిగా తిరుగుతున్నాయి. స్థానిక జేఏసీ నేతలు తమకు అసలు బంద్ గురించి సమాచారమే లేదని చెబుతున్నారు. (చదవండి: సీఎం జగన్‌కు రాజధాని రైతుల కృతజ్ఞతలు)
Comments
Please login to add a commentAdd a comment