
సాక్షి, అమరావతి: వికేంద్రీకరణ బిల్లును చర్చకు తీసుకున్న సమయంలో ఎలాంటి మోషన్ మూవ్ కాలేదని శాసన మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. సాంకేతికంగా మోషన్ మూవ్ అయితేనే ఏదైనా నిర్ణయం తీసుకోగలమని స్పష్టం చేశారు. ‘బిల్లు మూవ్ చేసిన తర్వాత యనమల మాట్లాడారు. అప్పుడు అశోక్‌బాబు నోటీసులు ఇచ్చారు’ అని పేర్కొన్నారు. కాగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ టీడీపీ సభ్యులు మండలిలో గందరగోళం సృష్టించారు. మంత్రులవైపు దూసుకువెళ్లారు. ఇక బిల్లును చర్చకు తీసుకున్నప్పుడు ఎలాంటి మోషన్ మూవ్ చేయలేదు కాబట్టి.. నిబంధనల ప్రకారం దానిని సెలెక్ట్ కమిటీకి పంపకూడదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.