
సాక్షి, విశాఖపట్నం: స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అంశం తమ పరిధిలో ఉండదని కేంద్రం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధానిపై నిర్ణయం రాష్ట్ర పరిధి అంశమని తెలిసే చంద్రబాబు రాద్ధాంతం చేశారని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో రాజధాని రైతులను బాబు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. (రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’)
‘బుద్ధున్నవారు ఎవరైనా విశాఖలో రాజధానికి వస్తారా’ అన్న బాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బుద్ధి లేకేనా.. విశాఖలో బాబు సదస్సులు నిర్వహించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ల్యాండ్ పూలింగ్ పేదల ఇళ్ల కోసం చేపడుతున్నామని, ఇందులో అవినీతికి ఆస్కారమే లేదన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానానికి బాబు అనుకూలమా, వ్యతిరేకమా చెప్పాలని మంత్రి ప్రశ్నించారు.
చదవండి: టీడీపీ ఇన్‌సైడర్ ట్రేడింగ్.. ఒక్కొక్కరు ఎంత కొన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment