చంద్రబాబుకు సవాల్‌ విసిరిన కొడాలి నాని | Kodali Nani Challenge TDP MLAs To Resign For Amaravati | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు సవాల్‌ విసిరిన కొడాలి నాని

Published Mon, Jan 20 2020 5:56 PM | Last Updated on Mon, Jan 20 2020 6:45 PM

Kodali Nani Challenge TDP MLAs To Resign For Amaravati - Sakshi

సాక్షి, అమరావతి : స్వార్థ ప్రయోజనాల కోసం అమరాతిపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నా​రని మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా సామాజిక అంశాన్ని లేవనెత్తిన బాబు.. రాజధాని తరలిపోతే కమ్మ కులస్తులకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. కేవలం కమ్మవారి కోసమే ఇక్కడ రాజధాని పెట్టారా..? అని మంత్రి ప్రశ్నించారు. కులంపై ద్వేషంతో రాజధాని తరలించడం లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. 
(చదవండి : చంద్రబాబు సంఘవిద్రోహ శక్తా?)

‘ఉత్తరాంధ్ర ప్రజలు మంచివారు. పురందేశ్వరి కమ్మ కాదా. కంభంపాటి హరిబాబు కమ్మ కాదా. వైజాగ్‌లో ఉన్న నేతలు ఏ సామాజికవర్గానికి చెందినవారు. లోకేశ్‌ తోడల్లుడికి చెందిన గీతం వర్సిటీ విశాఖలో ఉంది. 50 నుంచి 80 శాతం వ్యాపారాలు కమ్మవారివే. కమ్మవారిపై కోపం ఉంటే కర్నూలు, కడప రాజధానిగా పెట్టేవారు కదా. ఇప్పుడు కమ్మవారికి రెండు రాజధానులు వచ్చాయి. బెదిరింపులకు సీఎం జగన్‌ భయపడరు. జోలె పట్టుకుని అడుక్కుంటే ఎవరూ జాలి చూపించరు. కృష్ణా, గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయాలి. అప్పటి పీసీసీ ప్రెసిడెంట్‌ తెలంగాణ వాదం లేదంటే.. కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలిచారు. గతంలో వైఎస్‌ జగన్‌ కూడా ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి గెలిచారు’అని మంత్రి తెలిపారు.
(చదవండి : ‘ఢిల్లీ ఏమైనా మధ్యలో ఉందా’)

సవాల్‌​ స్వీకరించాలి..
‘అమరావతినే ప్రజలు రాజధానిగా కోరుకుంటున్నారనే నమ్మకం మీకుంటే.. టీడీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. మీపై మీకు నమ్మకం ఉంటే రాజీనామా చేసి గెలవాలి. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్నారు. నాకు వైఎస్సార్‌ లాంటి మరణాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. వైఎస్సార్‌ మరణానంతరం ఆయన పేరుపై పార్టీ పెట్టి 5 లక్షల మెజారిటీతో వైఎస్‌ జగన్‌ ఎంపీగా గెలిచారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ నుంచి పార్టీని లాక్కున్నారు. కొడుకును కూడా బాబు గెలిపించుకోలేకపోయారు’అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.
(చదవండి : రాజధానులు ఎంతెంత దూరం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement