
సాక్షి, గుంటూరు : చంద్రబాబు రెచ్చగొట్టే మాటలు నమ్మితే యువత జీవితాలు నాశనమవుతాయని వైఎస్సార్‌సీపీ నేత, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మ సామాజిక వర్గం ఉన్న ప్రాంతాల్లోనే బాబు మీటింగులు పెడుతున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ‘ఒక్కరోజు జైలుకెళ్లినా పరవాలేదని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. తన కుమారుడు లోకేష్ బాబును జైలుకు పంపుమంటే పంపుతారా..? కమ్మ సామాజిక ప్రజాప్రతినిధిగా మన మేలు కోసం చెప్తున్నా.. చంద్రబాబు మాటలు నమ్మి జీవితాలు పాడుచేసుకోవద్దు’ అని శివకుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment