
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యత ఇస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎందుకంత ఆక్రోశం అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు దేనికోసం చేస్తోందని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువ సమయం ప్రతిపక్షానికే ఇచ్చామని.. అయినా సీఎం మాట్లాడుతున్న సమయంలో అడుగడుగునా అడ్డు తగిలారని ధ్వజమెత్తారు. నిన్న అసెంబ్లీలో ప్రతిపక్షం వ్యవహరించిన తీరు సిగ్గుచేటు అని.. వారు వ్యవహరిస్తోన్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్షం అంటే హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రాంతీయ విద్వేషాలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
రాజధాని పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం కావడం చాలా సంతోషంగా ఉందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబాటు పై ప్రతి కమిటీలోనూ స్పష్టం గా చెప్పారన్నారు. రాయలసీమ ప్రాంతాల్లో చినుకు కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారన్నారు. శ్రీ బాగ్ ఒడంబడిక చదువుతుంటే తమ కంట కన్నీరు వచ్చిందన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు హైకోర్టు కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాకుళం లో ఉద్దానం కిడ్నీ బాధితులకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలుస్తున్నారన్నారు. రాయలసీమ వాసులకు చెరువులు ద్వారా సాగునీరు అందించాలని ముఖ్యమంత్రిని కోరామని తెలిపారు.
(చదవండి: ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి?)
(చదవండి: సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం)
Comments
Please login to add a commentAdd a comment