
సాక్షి, అమరావతి : భవాని ఐల్యాండ్‌ను గత వారం ప్రారంభించామని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే చిన్న బోట్లకు అనుమతి ఇచ్చామని.. మిగిలిన బోట్లను కూడా తనిఖీ చేసి అనుమతి ఇస్తామని తెలిపారు. మొత్తం 9 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు వెల్లడించారు. 20వ తేదికి కంట్రోల్ రూమ్‌లను పూర్తి చేస్తామని, కంట్రోల్ రూమ్‌ల పరిధిలోనే బోట్లు నడుపుతామని మంత్రి తెలిపారు. (బాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: అవంతి)
అదే విధంగా రాజధాని అంశం తమ పరిధిలో ఉండదని కేంద్రం స్పష్టం చేసిందని మంత్రి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ‘బుద్ధి ఉన్నవాడు ఎవరైనా విశాఖపట్నం వద్దమనుకుంటారా’ అని చంద్రబాబు అనడం సిగ్గుచేటు అని మంత్రి అవంతి అన్నారు. చంద్రబాబు ఇక మీదట విశాఖలో అడుగు పెట్టడా అని ప్రశ్నించారు. విశాఖ ఏమైనా దండకరణ్యంలో ఉందా అని, విశాఖలో ఓట్లు, సీట్లు మాత్రం తమకు కావాలా అని బాబును నిలదీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని గుర్తు చేశారు. అమరావతిలోని అసెంబ్లీలో చంద్రబాబు కనీసం బాత్రూంలు కూడా కట్టలేదని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment