‘సమాచారం ఇవ్వమంటే బాబు పట్టించుకోలేదు’ | Buggana Rajendranath Slams Chandrababu Misleading On AP Capital | Sakshi
Sakshi News home page

‘సమాచారం ఇవ్వమంటే బాబు పట్టించుకోలేదు’

Published Mon, Jan 20 2020 8:52 PM | Last Updated on Mon, Jan 20 2020 9:06 PM

Buggana Rajendranath Slams Chandrababu Misleading On AP Capital - Sakshi

వరదలు వస్తే... అమరావతి ప్రాంతం ఎలా మారుతుందో బాబుకు తెలియదా. ఆయన తెలిసి మాట్లాడుతున్నారో.. తెలియక వాదిస్తున్నారో అర్థం కావడం లేదు

సాక్షి, అమరావతి : శివరామకృష్ణన్‌ కమిటీ గురించి చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. అమరావతి ప్రాంతంలో ఎత్తైన భవనాలు అనుకూలం కాదని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ‘ఇక్కడ వ్యవసాయ భూమిని తీసుకోవద్దని, అది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి దారితీస్తుందని కమిటీ స్పష్టంగా చెప్పింది.

ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రభుత్వ భూమి ఉందా అని కమిటీ సమాచారం ఇవ్వమంటే.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. 25 గంటల్లోనే రాజధానిపై ఫోన్‌ ద్వారా తమ అభిప్రాయం చెప్పాలని కోరితే.. కేవలం 1500 మంది ప్రజలు మాత్రమే చెప్పారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు తమ అభిప్రాయం చెప్పలేదు. వరదలు వస్తే... అమరావతి ప్రాంతం ఎలా మారుతుందో బాబుకు తెలియదా. ఆయన తెలిసి మాట్లాడుతున్నారో.. తెలియక వాదిస్తున్నారో అర్థం కావడం లేదు’అని బుగ్గన విమర్శలు గుప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement