
అరుణాచల్ గవర్నర్ తొలగింపునకు సర్వం సిద్ధం
పదవినుంచి తప్పుకోవాలన్న కేంద్రం చేసిన సూచనను వ్యతిరేకించిన అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవాను తప్పించేందుకు రంగం సిద్ధమవుతోంది.
గువాహటి: పదవినుంచి తప్పుకోవాలన్న కేంద్రం చేసిన సూచనను వ్యతిరేకించిన అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవాను తప్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. బుధవారం నుంచి రెండ్రోజుల పాటు సమావేశం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల (జీఎస్టీ ఆమోదానికి) తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.
అప్పటివరకు ఆయనే గవర్నర్‌గా ఉంటారు. అనారోగ్యం తో బాధపడుతున్న జ్యోతిప్రసాద్ ఆగస్టు 13 నుంచి తిరిగి విధుల్లో చేరారు. దీంతో తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నందున రాజీనామా చేయాలని ఓ కేంద్ర మంత్రి ద్వారా గవర్నర్‌కు సందేశం వచ్చింది. దీనిపై అధికారికంగా సమాచారమేమీ లేనప్పటికీ.. తనను తప్పుకోమనటం అవమానకరమని, ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీనా మా చేసే ప్రసక్తే లేదని గవర్నర్ తెలిపారు. రాష్ట్రపతి చెబితే తప్ప తప్పుకునే ప్రసక్తే లేదని, తన తప్పేంటో చెప్పాలన్నారు.