మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం | AP Assembly Pass Dissolution Of Legislative Council | Sakshi
Sakshi News home page

మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

Published Mon, Jan 27 2020 6:24 PM | Last Updated on Thu, Mar 21 2024 7:59 PM

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన 133 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. అనంతరం తీర్మానం ఆమోదం పొందినట్లు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్‌ తెలిపారు. మండలిని రద్దు చేయాలని సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా పెద్దల సభను రద్దు చేయాలని తీర్మానించి.. దానిని సీఎం జగన్‌ శాసనసభ ముందు ఉంచారు. దీనిపై రోజంతా సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement