సాక్షి, అమరావతి : శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముందస్తు ఆలోచనతోనే టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా వారు నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారని తెలిపారు. అందుకనే టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తున్నట్టు తెలిపారు. సత్వర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎథిక్స్ కమిటీని స్పీకర్ ఆదేశించారు. సభా మర్యాదలు ఉల్లంఘిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. చట్ట సభలో హుందాగా, మర్యాదగా ప్రవర్తించాలని టీడీపీ సభ్యులకు స్పీకర్ హితవు పలికారు.
(చదవండి : టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం)
‘శాసనసభలో ఈరోజు జరిగిన ఉదంతం చాలా దురదృష్ణకరం. ప్రతి సభ్యుడు నియామాలకు కట్టుబడి ఉండాలి. సభా హక్కులను హరించే అధికారం ప్రభుత్వానికిగానీ, ప్రతిపక్షానికిగానీ లేదు. ప్రతి సభ్యుడు సభా గౌరవాన్ని కాపాడాలి. ముందస్తు ఆలోచనతోనే టీడీపీ సభ్యులు మితిమీరి ప్రవర్తించారు. ప్రభుత్వంపై భిన్నాభిప్రాయాలు ఉంటే చెప్పొచ్చు. మాట్లాడేందుకు అవకాశమిస్తానని పదే పదే చెప్పినా టీడీపీ సభ్యులు వినలేదు. సస్పెండ్ చేస్తే సభ నుంచి వెళ్లిపోతామంటున్నారు. టీడీపీ సభ్యులకు చెప్పి చెప్పి విసుగెత్తిపోయాను. రెండు గంటలపాటు నిరసనలు చేసి వెళ్లిపోయారు’ అని స్పీకర్ తెలిపారు.
(చదవండి : టీడీపీది దిక్కుమాలిన వైఖరి)
(చదవండి : ఐయామ్ సారీ..!)
Comments
Please login to add a commentAdd a comment