సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడో రోజు రసాభాసగా సాగుతున్నాయి. బుధవారం సభలో ‘రైతు భరోసా’ కేంద్రాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చర్చను ప్రారంభించారు. అయితే సమావేశం ప్రారంభం నుంచే టీడీపీ సభ్యులు చర్చను అడ్డుకుంటున్నారు. సభ సజావుగా సాగేందుకు కృషి చేయాలని స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసినా టీడీపీ సభ్యులు పట్టించుకోకుండా నినాదాలు చేస్తునే ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులపై మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘గత మూడు రోజులుగా స్పీకర్ స్థానాన్ని టీడీపీ సభ్యులు అవమానపరుస్తున్నారు. స్పీకర్ వైపు వేలు చూపిస్తూ బెదిరిస్తున్నారు. టీడీపీ సభ్యులకు బెదిరించడం ప్రతీ రోజు అలవాటైంది. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులకు ఎంతో భరోసానిచ్చే ‘రైతు భరోసా’పై జరుగుతున్న చర్చను అడ్డుకోవడం దారుణం. దీని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు అండ్ టీంకు రైతులపై ప్రేమేలేదు. టీడీపీ సభ్యులకు రైతులు, సంక్షేమ పథకాలు వద్దు. వారికి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే కావాలి. చంద్రబాబుకు రియల్ ఎస్టేట్‌పైనే ప్రేమ ఉంది. రైతులపై, రాష్ట్ర అభివృద్ది పై కాదు’ అంటూ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
చదవండి:
రాజధానులిక అందరివీ..
Comments
Please login to add a commentAdd a comment