ఇదేమైనా మీ ఇల్లనుకుంటున్నారా? | AP Assembly Special Session Speaker Fires On TDP MLAs Behavior | Sakshi
Sakshi News home page

టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తీవ్ర ఆగ్రహం

Published Wed, Jan 22 2020 11:17 AM | Last Updated on Wed, Jan 22 2020 3:46 PM

AP Assembly Special Session Speaker Fires On TDP MLAs Behavior - Sakshi

సాక్షి, అమరావతి: సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్న టీడీపీ శాసనసభ‍్యులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభం కాగానే, రైతు భరోసా కేంద్రాలపై చర్చ ప్రారంభమైంది. అయితే టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ, స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లారు. వెల్‌లోకి వచ్చి ఆందోళన చేయవద్దని, సంయనమనం పాటించాలని స్పీకర్‌ పదే పదే విజ్ఞప్తి చేసినా, టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోలేదు.
(చదవండి : ఐయామ్‌ సారీ..!)

దీంతో స్పీకర్‌ తన స్థానం నుంచి లేచి నుంచొని ‘వాటీజ్‌ దిస్‌’ అంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పీకర్‌పై దాడికి యత్నించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తీవ్ర మనస్తాపం చెందారు. సభలో ఎవరు దౌర్జ్యంగా ప్రవర్తిస్తునానరో జనం గమనిస్తున్నారని అన్నారు. ఇది మీ ఇళ్లా.. లేక అసెంబ్లీనా అని స్పీకర్‌ తమ్మినేని టీడీపీ ఎమ్మెల్యేపై ఫైర్‌ అయ్యారు. టీడీపీ సభ్యుల తీరుతో ఇతర సభ్యుల హక్కులు హరించుకుపోతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే ఎటువంటి చర్యలకైనా సిద్ధమని హెచ్చరించారు.
(చదవండి : బిల్లులపై మండలిలో రగడ)
(చదవండి : టీడీపీది దిక్కుమాలిన వైఖరి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement