
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ‘పసుపు- కుంకుమ’ పేరుతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి.. ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ప్రతిపక్ష సభ్యులపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. దోచుకోవడం తప్ప.. చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. పొత్తులు లేకుండా టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదని.. ఏ పార్టీతో కలుద్దామా అని టీడీపీ ఆలోచిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.
అంబేద్కర్ అంటే టీడీపీకి గౌరవం లేదు..
టీడీపీకి అంబేద్కర్ అంటే గౌరవం, ప్రేమ లేదని.. దళితులను హేళన చేయడం చంద్రబాబుకు అలవాటని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. టీడీపీ దళిత ద్రోహి అని విమర్శించారు. టీడీపీ సభ్యులు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని.. దళిత చట్టాలను టీడీపీ వ్యతిరేకించడం దారుణమన్నారు. చంద్రబాబు మొదట నుంచి దళితులను మోసం చేస్తూనే ఉన్నారని మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment