
అతడు ఆమెలా.. ఆమె అతడిలా!
వారిద్దరూ నవ దంపతులు. ఉన్నత చదువులు చదివారు. అయినా సంప్రదాయాన్ని మరువలేదు. కుటుంబ ఆచారం మేరకు వివాహమైన మరుసటి రోజు వరుడు మహిళ వేషధారణలోను, వధువు పురుషుని వేషధారణలోను కులదైవం గంగానమ్మను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడెంకు చెందిన వరప్రసాద్‌కు ప్రశాంతితో ఆదివారం వివాహమైంది. సోమవారం నవదంపతులిద్దరూ వరుడు ఇంటికి చేరుకునే ముందు సంప్రదాయాన్ని పాటించారు. వరుడు మహిళ అలంకరణలో, వధువు పురుష వేషధారణలో గంగానమ్మను దర్శించుకున్నారు.
- ద్వారకాతిరుమల