ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని తిరుపతి వైఎస్ఆర్ సీపీ ఎంపీ వరప్రసాద్ విమర్శించారు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించాలన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని తిరుపతి వైఎస్ఆర్ సీపీ ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు.
ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగ సమస్య తీరుతుందని వరప్రసాద్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో టీడీపీ మంత్రులు పదవులు వదులుకోవాలని వరప్రసాద్ అన్నారు.