రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1096 ఎంపీపీ స్థానాల కు సంబంధించిన రిజర్వేషన్ల సంఖ్యను పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్ నేతృత్వంలోని అధికారుల బృందం నిర్ధారించింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1096 ఎంపీపీ స్థానాల కు సంబంధించిన రిజర్వేషన్ల సంఖ్యను పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్ నేతృత్వంలోని అధికారుల బృందం నిర్ధారించింది. ఈ సంఖ్య ఆధారంగా జిల్లాల కలెక్టర్లు మండలాల జనాభా, రొటేషన్ విధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఏ మండలం ఏ కేటగిరీ (రిజర్వేషన్) కిందకు వస్తుందో ప్రకటి స్తారు.
పూర్తి జాబితాను ఎన్నికల నోటిఫికేషన్ (ఈ నెల 17న) సమయంలో వెల్లడిస్తారు. అలాగే ఏ జెడ్పీటీసీ ఎవరికి రిజర్వ్ అరుు్యందన్న విషయూన్ని కూడా ఇదే తరహాలో కలెక్టర్లే ప్రకటిస్తారు. ఎంపీపీ చైర్‌పర్సన్ల రిజర్వేషన్ల సంఖ్యను జిల్లాల వారీగా కమిషనర్ వరప్రసాద్ కలెక్టర్లకు పంపించారు. మొత్తం 1096 ఎంపీపీ స్థానాల్లో యాభై శాతం విధిగా మహిళలకు కేటాయించాలి.
ఆ విధంగా వారికి 548 స్థానాలు మాత్రమే దక్కాల్సి ఉంది. కానీ కొన్ని జిల్లాల్లో మండలాలు బేసి సంఖ్యలో ఉండడం వల్ల మహిళలకు ఒక సీటు అదనంగా అంటే 549 స్థానాలను రిజర్వ్ చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని 49 మండలాలను పూర్తిగా ఎస్టీలకే (మహిళలకు 25) రిజర్వ్ చేశారు. అంటే ఎంపీపీ అధ్యక్షులుగా ఎస్టీలనే ఎన్నుకోవాల్సి ఉంటుంది.
ఏజెన్సీయేతర ప్రాంతాల్లోనూ జనాభా ప్రాతిపదికన ఎస్టీలకు 73 మండలాలను (మహిళలకు 37) రిజర్వ్ చేశారు. ఇక ఎస్సీలకు రాష్ట్రవ్యాప్తంగా 202 (మహిళలకు 101), బీసీలకు 356 (మహిళలకు 178), మండలాలను కేటారుుంచగా అన్ రిజర్వ్‌డ్ కింద 416 (మహిళలకు 208) మండలాలున్నారుు.
