లాకర్‌లోని మూడు కేజీల నూట అరవై నాలుగు గ్రాముల బంగారాన్ని చోరీ చేసిన నిందితుడ్ని పోలీసులు పట్టుకున్న సంఘటన మంగళవారం ఆకివీడులో జరిగింది.
లాకర్‌లోని మూడు కేజీల నూట అరవై నాలుగు గ్రాముల బంగారాన్ని చోరీ చేసిన నిందితుడ్ని పోలీసులు పట్టుకున్న సంఘటన మంగళవారం ఆకివీడులో జరిగింది. ఈ నెల 20వ తేదీ అకివీడులోని కార్పొరేషన్ బ్యాంక్‌లో 3కేజీల 164 గ్రాముల బంగారాన్ని ఓ వ్యక్తి లాకర్‌లో దాచుకున్నాడు. దీనిని గమనించిన బ్యాంక్ అప్రయిజ్ కె. వరప్రసాద్ లాకర్‌లోని బంగారాన్ని చోరీ చేశాడు. చోరీ చేసిన బంగారం విలువ 68.20 లక్షలు ఉంటుంది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడ్ని మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మూడు కేజీల నూట ముప్పయి ఆరు గ్రాములు బంగారాన్ని రికవరీ చేశారు.