bank locker
-
రూ.18 లక్షల నగదును చెద పురుగులు తినేశాయి
లక్నో: బ్యాంకు లాకర్లో దాచిన రూ.18 లక్షల నగదును చెద పురుగులు తినేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాబాబాద్లో జరిగింది. మొరాదాబాద్‌కు చెందిన మహిళ అల్కా పాఠక్ తన కుమార్తె పెళ్లి కోసం పొదుపు చేసిన రూ.18 లక్షల నగదును గత ఏడాది అక్టోబర్‌లో బ్యాంకు ఆఫ్ బరోడా శాఖలోని లాకర్లో భద్రపర్చింది. లాకర్ అగ్రిమెంట్‌ను నవీకరించుకోవాలని, కేవైసీ వివరాలు ఇవ్వాలని ఇటీవల బ్యాంకు సిబ్బంది ఆమెకు ఫోన్ చేసి చెప్పారు. అల్కా పాఠక్ బ్యాంకుకు వెళ్లి తన లాకర్‌ను తెరిచి చూసు కోగా, చెత్తాచెదారమే కనిపించింది. నగదును చెదపురుగులు కొరికేసి ముక్క లు ముక్కలు చేశాయి. మొత్తం సొమ్మంతా పనికి రాకుండా పోయింది. ఈ ఘటనపై బ్యాంకు సిబ్బంది స్పందించారు. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేశామని అన్నారు. అల్కా పాఠక్‌కు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం.. బ్యాంకు లాకర్లలో నగదు భద్రపర్చడానికి వీల్లేదు. నగలు, డాక్యుమెంట్లు మాత్రమే భద్రపర్చుకోవాలి. -
కేడీసీసీ బ్యాంక్‌లో దోపిడీకి యత్నం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంక్‌లో ఆదివారం రాత్రి దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న బ్యాంక్‌లోకి దొంగలు ప్రవేశించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జరిగిన సంఘటనపై ఎస్పీ అఖిల్‌మహాజన్ ఆరా తీశారు. బ్యాంక్ అధికారులు, సీఐ మొగిలి తెలిపిన వివరాలు. మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంక్ వద్ద భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పనులు చేసేందుకు భవనానికి తూర్పు వైపున పలంచ కొట్టారు. దాని ద్వారా మొదటి అంతస్తుపైకి ఎక్కి.. అల్యూమినియం స్లైడింగ్ కిటికి నుంచి బ్యాంక్లోనికి ఇద్దరు దొంగలు ప్రవేశించారు. మొదట సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్లను కట్ చేశారు. అనంతరం బ్యాంక్‌లో ఉన్న రెండు షెట్టర్లను ఇనుపరాడుతో పైకెత్తి స్ట్రాంగ్‌రూం లాకర్‌ను కట్టర్‌తో తెరిచేందుకు ప్రయత్నించారు. తెరుచుకోకపోవడంతో అక్కడే ఉన్న ఫైళ్లను చిందరవందరగా పడేసి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం బ్యాంక్‌ను తెరిచేందుకు వాచ్మెన్ అనిల్ వచ్చి పరిస్థితిని మేనేజర్ సంపూర్ణకు వివరించాడు. మేనేజర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ మొగిలి, ఎస్సై ప్రేమ్‌దీప్, క్లూస్‌టీం సభ్యులు, సీసీఎస్ ఎస్సై మారుతి ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. దొంగల వేలిముద్రలు సేకరించి, డాగ్స్క్వాడ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ పుటేజీల ఆధారంగా బ్యాంక్‌లోకి ఇద్దరూ దొంగలు ప్రవేశించినట్లు సీఐ తెలిపారు. గుర్తుపట్టకుండా ఉండేందుకు తలకు హెల్మెట్, చేతులకు గ్లౌస్లు ధరించారన్నారు. సీసీ పుటేజీల ఆధారంగా దొంగలను త్వరలోనే పట్టుకుంటామని వివరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. బ్యాంక్‌లో భద్రత చర్యలు బ్యాంక్‌లో దొంగతనం జరిగినట్లు తెలుసుకున్న రవీందర్రావు హుటాహుటిన ఎల్లారెడ్డిపేటకు వచ్చారు. దొంగతనంపై మేనేజర్ సంపూర్ణ, సింగిల్‌విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కృష్ణారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. బ్యాంక్‌లో కట్టుదిట్టమైన భద్రత ఉందని వినియోగదారులు, రైతులు ఆందోళనకు గురికావద్దని కోరారు. పూర్తి భద్రత వలయంలో బ్యాంక్‌ను నడిపిస్తున్నామని చెప్పారు. నూతన భవనం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మధ్యాహ్నం నుంచి బ్యాంక్ లావాదేవీలు కొనసాగించారు. మేనేజర్ సంపూర్ణ, సిబ్బంది ఉన్నారు. – రవీందర్రావు, టెస్కాబ్ చైర్మన్ -
బ్యాంక్ లాకర్ డెడ్‌లైన్: ఖాతాదారులకు బ్యాంకుల అలర్ట్..
Bank Locker Deadline: విలువైన వస్తువులు, ఆభరణాలు, పత్రాలను భద్రపరచడానికి అత్యంత సురక్షితమైన సాధనం బ్యాంక్ లాకర్ అని మనందరికీ తెలుసు. ఈ బ్యాంక్ లాకర్ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి లాకర్ పరిమాణాన్ని బట్టి ఖాతాదారుల నుంచి బ్యాంకులు రుసుములు వసూలు చేస్తాయి. ఈ లాకర్లకు సంబంధించి ప్రతి బ్యాంకుకు సొంత నిబంధనలు ఉంటాయి. తాజగా బ్యాంక్ లాకర్ల వినియోగదారులకు ఎస్బీఐతో సహా అనేక బ్యాంకులు ముఖ్యమైన అలర్ట్ అందించాయి. సవరించిన లాకర్ ఒప్పందంపై జూన్ 30 లోపు సంతకం చేయడం తప్పనిసరి అని సూచించాయి. ఆర్బీఐ మార్గదర్శకాలేంటి? జనవరి 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకు లాకర్ ఒప్పంద ప్రక్రియను 2023 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. అయితే జూన్ 30 నాటికి 50 శాతం లాకర్ ఒప్పందాల పునరుద్ధరణ పూర్తవ్వాలి. ఆ తర్వాత సెప్టెంబరు 30 నాటికి 75 శాతం, డిసెంబర్ 31 నాటికి 100 శాతం పూర్తవ్వాలని ఆర్బీఐ బ్యాంకులకు నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ సహా అనేక బ్యాంకులు లాకర్ ఒప్పందాలు పూర్తి చేయాలని కస్టమర్లకు అలర్ట్‌లు పంపిస్తున్నాయి. సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా 2021 ఫిబ్రవరిలో ఆర్బీఐ ఈ ఆదేశాలను జారీ చేసింది. తర్వాత 2021 ఆగస్టులో లాకర్ ఒప్పంద నియమాలను సవరించింది. ఎటువంటి చార్జ్ లేకుండా.. బ్యాంకుల్లో కొత్త లాకర్లను పొందే కస్టమర్ల కోసం ఒప్పంద నియమాలు 2022 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పటికే లాకర్లు కలిగిన కస్టమర్లు ఒప్పంద ప్రక్రియను 2023 జనవరి 1 నాటికే పూర్తి చేయాల్సి ఉండగా చాలా మంది కస్టమర్లు సవరించిన ఒప్పందాలను పూర్తి చేయలేదు. దీంతో ఆర్బీఐ గడువును 2023 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి ఎటువంటి చార్జ్‌లు వసూలు చేయకుండా స్టాంప్ పేపర్‌పై ఒప్పందాలను పూర్తి చేయాలి. లాకర్ నిబంధనలు ఇవే.. బ్యాంక్ లాకర్లు వివిధ నియమ నిబంధనలకు లోబడి ఉంటాయి. వర్షాలు, వరదలు, భూకంపం, పిడుగులు పడటం వంటి విపత్తులు, అల్లర్లు, తీవ్రవాద దాడుల వంటి ఘటనల కారణంగా లాకర్‌కు కలిగే నష్టానికి బ్యాంకులు బాధ్యత వహించవు. అయితే లాకర్ భద్రతను నిర్ధారించడం బ్యాంక్ బాధ్యత. అగ్నిప్రమాదం, దొంగతనం, చోరీలు, దోపిడీలు, భవనం కూలడం, బ్యాంకు నిర్లక్ష్యం, బ్యాంకు ఉద్యోగులు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడిన సందర్భాల్లో మాత్రం బ్యాంకులు కస్టమర్లకు నష్టపరిహారాన్ని అందించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Tax Exemption: పన్ను మినహాయింపు.. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై ఆర్థిక శాఖ కీలక ప్రకటన -
సామన్యులకు అలర్ట్: కొత్తగా మారిన రూల్స్ తెలుసుకోవడం తప్పనిసరి!
2023లోకి అడుగు పెట్టాం. కొత్త ఏడాదిలో ముందుగా నిర్వహించాల్సిన కొన్ని ముఖ్యమైన ఆర్థిక పనులు ఉన్నాయి. బ్యాంకు లాకర్ల ఒప్పందాలను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం మొదటిది. ఇందుకు సంబంధించి కొన్ని బ్యాంకు కస్టమర్లకు సందేశాలు వస్తున్నాయి. తర్వాత పన్నుల ఆదా పెట్టుబడులకు సంబంధించిన వివరాలను పనిచేస్తున్న కంపెనీలకు సమర్పించడం. ఒకవేళ ఇప్పటికీ ఆ పనిచేయకపోతే మించిపోయినది ఏమీ లేదు. మరో మూడు నెలల గడువు ఉందని గమనించాలి. అలాగే, కొన్ని కీలకమైన మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ వివరాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.. లాకర్ ఒప్పందాల్లో మార్పులు బ్యాంకుల్లో లాకర్లు చాలా మందికి ఉంటాయి. ఈ సేఫ్ డిపాజిట్ లాకర్‌కు సంబంధించి ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలంటూ బ్యాంకులు తమ కస్టమర్లను కోరుతున్నాయి. ‘‘ప్రియమైన కస్టమర్, ఆర్బీఐ సూచనల మేరకు మీరు మీ బ్రాంచ్‌కు వెళ్లి సవరించిన లాకర్ ఒప్పందాన్ని జనవరి 1 నాటికి కుదుర్చుకోవాలి. ఇప్పటికే ఆ పనిచేసి ఉంటే ఈ సందేశాన్ని మర్చిపోండి’’అనే సందేశం చాలా మంది కస్టమర్లకు వస్తోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ ఇందుకు సంబంధించి తన కస్టమర్లకు ఎస్ఎంఎస్లు పంపిస్తోంది. 2021 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫలితమే ఇది. కోర్టు ఆదేశాలు వెలువడిన ఆరు నెలల్లో లాకర్ నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాల్లో మార్పులను ఖరారు చేయాలని ఆర్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో 2021 ఆగస్ట్‌లో ఆర్బీఐ ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా బ్యాంక్ బోర్డులు ఆమోదించిన లాకర్ నిర్వహణ ఒప్పందాన్ని బ్యాంకులు అమల్లో పెట్టాల్సి ఉంది. ‘‘ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ రూపొందించే నమూనా లాకర్ ఒప్పందాన్ని బ్యాంకులు అమలు చేయవచ్చు. ఈ ఒప్పందం, సవరించిన మార్గదర్శకాలు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉండాలి’’అని ఆర్బీఐ తన నోటిఫికేషన్లో పేర్కొంది. కొత్త నిబంధనలు కొత్తగా లాకర్ తీసుకునే వారికి 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. కానీ, దానికంటే ముందు లాకర్ తీసుకున్న వారికి ఈ ఏడాది జనవరి 1 వరకు గడువు ఉంది. ఎస్బీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర చాలా బ్యాంకులు సవరించిన నిబంధనలతో లాకర్ ఒప్పందాలను అమల్లోకి తీసుకొచ్చాయి. కాకపోతే ఇప్పటికీ చాలా మంది లాకర్ ఒప్పందాలపై తిరిగి సంతకాలు చేయలేదు. నిజానికి నూతన నిబంధనలన్నవి కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణ కోణంలో తీసుకొచ్చినవి. అందుకుని ఆలస్యం చేయకుండా కస్టమర్లు తమ బ్యాంక్ శాఖకు వెళ్లి కొత్త ఒప్పంద డాక్యుమెంట్లు, స్టాంప్ పేపర్లపై సంతకాలు పెట్టాలి. కొన్ని బ్యాంకులు స్వయంగా ఈ డాక్యుమెంట్లను అందిస్తుంటే, కొన్ని స్టాంప్ పేపర్లు తెచ్చుకోవాలంటూ కస్టమర్లకే చెబుతున్నాయి. స్టాంప్ పేపర్‌పై ఒప్పందం కుదుర్చుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. ఇరు పార్టీలు చేసుకున్న ఒప్పందం కాపీ ఒకదాన్ని లాకర్‌ను అద్దెకు తీసుకున్న వ్యక్తికి అందించడం కూడా తప్పనిసరి. ఒరిజినల్ అగ్రిమెంట్ పత్రాలు బ్యాంకు దగ్గరే ఉంటాయి. బ్యాంక్ అడిగినప్పుడే లాకర్ పునరుద్ధర గురించి ఆలోచిద్దామని అనుకోకుండా, స్వయంగా వెళ్లి దాన్ని పూర్తి చేసుకోవడం అవసరం. ‘‘బ్యాంక్‌లు తమ కస్టమర్లతో కొత్త ఒప్పందాలను 2023 జనవరి 1 నాటికి చేసుకోవడం తప్పనిసరి. ఈ తేదీని పొడిగింపుపై స్పష్టత లేదు. అందుకని కస్టమర్లే తమ బ్యాంక్ శాఖలకు వెళ్లి దీన్ని అప్డేట్ చేసుకోవాలి’’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి సూచించారు. కొన్ని బ్యాంక్‌లు కస్టమర్లకు సమాచారం ఇస్తున్నాయే కానీ, నిర్ణీత గడువులోపు చేయాలంటూ నిర్ధేశించడం లేదు. కాకపోతే లాకర్ ఒప్పందాన్ని పునరుద్ధరించుకునే సమయంలో పూర్తిగా చదివి, నియమ నిబంధనలు తెలుసుకోవాలి. ఇక బ్యాంకు లాకర్ నిబంధనలపైనా అవగాహన కలిగి ఉండడం అవసరం. ఏడాదిలో ఒక్కసారి అయినా లాకర్ సదుపాయాన్ని ఉపయోగించుకుని ఉండాలి. లేదంటే బ్యాంక్‌లు చర్యలు తీసుకుంటాయి. ఏడాది పాటు వినియోగంలో లేని లాకర్‌ను బద్దలు కొట్టి అందులో ఉన్న వాటిని స్వాధీనం చేసుకునే అధికారం బ్యాంక్‌లకు ఉంటుంది. ఈ విధమైన సమస్య రావద్దని అనుకుంటే కనీసం ఏడాదిలో ఒకటి రెండు సార్లు అయినా లాకర్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. బ్యాంక్‌లు లాకర్లకు సంబంధించి మూడేళ్ల అద్దెకు సరిపడా డిపాజిట్‌ను ఖాతాదారుల నుంచి తీసుకునేందుకును ఆర్బీఐ అనుమతించింది. అంతేకాదు, లాకర్లను బ్రేక్ చేసేందుకు అయ్యే వ్యయాలను కూడా ముందుగా తీసుకోవచ్చు. లాకర్ తీసుకుని, వాటిని నిర్వహించకుండా, అద్దె కట్టకుండా ఉండే రిస్క్‌ను ఇది తప్పిస్తుంది. అయితే, దీర్ఘకాలం నుంచి ఖాతాదారులుగా, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కస్టమర్ల విషయంలో బ్యాంకులు ఈ విధమైన చర్యలను దాదాపుగా తీసుకోవు. లాకర్లను ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా నిర్వహించే కస్టమర్లను లాకర్ డిపాజిట్ కోసం ఒత్తిడి చేయవద్దని ఆర్బీఐ సైతం బ్యాంక్‌లకు సూచించడం గమనార్హం. బ్యాంక్‌లు లాకర్ కోసం డిపాజిట్ తీసుకున్నా.. రద్దు చేసుకుంటే తిరిగి ఆ డిపాజిట్ వెనక్కిచ్చేస్తాయి. పన్ను ఆదా వివరాలు ఉద్యోగులు పన్ను మినహాయింపు పెట్టుబడులు, ఇతర వ్యయాలకు సంబంధించిన వివరాలను పనిచేసే సంస్థకు జనవరి నెలలోనే సమర్పించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉంటే, టీడీఎస్‌ను మూడు నెలల వేతనాల్లో సంస్థలు మినహాయిస్తాయి. కనుక ప్రతి ఉద్యోగి బీమా పథకాలు, ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులు, పీపీఎఫ్, ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్, పిల్లల ట్యూషన్ ఫీజు తదితర వివరాలను అందించాలి. పన్ను మినహాయింపుల పెట్టుబడుల వివరాలు ఇవ్వడం వల్ల టీడీఎస్ బాధ్యతను తప్పించుకోవడం లేదంటే తగ్గించుకోవచ్చు. కేవైసీ తప్పనిసరి హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ట్రావెల్ లేదా మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని జనవరి 1 నుంచి కొనుగోలు చేసేవారు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. ఈ మేరకు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ‘‘గతంలో అయితే క్లెయిమ్ రూ.లక్ష మించినప్పుడే పాన్, ఆధార్ నంబర్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు హెల్త్, ట్రావెల్, మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే సమయంలోనే గుర్తింపు ధ్రువీకరణ, చిరునామా ధ్రువీకరణ కోసం పాన్, ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ సమర్పించడం తప్పనిసరి. అన్ని రకాల బీమా ప్లాన్లకు ఈ నిబంధన వర్తిస్తుంది’’అని పాలసీబజార్ సీఈవో సర్బ్వీర్ సింగ్ తెలిపారు. బ్యాంక్ పాస్‌బుక్ కాపీ పనికిరాదు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్లు కేవైసీ కింద చిరునామా ధ్రువీకరణ కోసం బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పాస్‌బుక్ కాపీ ఇస్తే గతంలో అనుమతించేవారు. ఇప్పుడు ఇవి చెల్లుబాటు కావు. పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లెటర్, ఆధార్‌ను సమర్పించొచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల కోసం ఇప్పటికీ బ్యాంకు స్టేట్మెంట్ కాపీ ఇవ్వొచ్చు. ఎన్పీఎస్ పాక్షిక ఉపసంహరణలు కరోనా కారణంగా ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఎన్పీఎస్ చందాదారులు పాక్షిక ఉపసంహరణకు సంబంధించి నోడల్ ఆఫీసర్ ధ్రువీకరణ తప్పనిసరి నిబంధన నుంచి పీఎఫ్ఆర్డీఏ ఉపశమనాన్ని ఇచ్చింది. దీంతో నోడల్ ఆఫీసర్ లేదా పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ నుంచి ఆమోదం అవసరం లేకుండానే ఎన్పీఎస్ చందాదారులు పాక్షిక ఉపసంహరణలకు వెసులుబాటు 2021 జనవరి 14 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పుడు కరోనా దాదాపు స్వల్ప స్థాయికి చేరడం, లాక్డౌన్ తదితర నిబంధనలు లేకపోవడంతో తిరిగి పాత నిబంధనను పీఎఫ్ఆర్డీఏ అమల్లోకి తీసుకొచ్చింది. కనుక ఈ జనవరి1 నుంచి ఎన్పీఎస్ కింద ప్రభుత్వ చందాదారులు గతంలోని నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. లకార్పై రుణం బ్యాంక్ లాకర్లో ఆభరణాలతోపాటు విలువైన పత్రాలను పెట్టుకోవడం సహజం. లాకర్ అద్దె చెల్లించడంలో విఫలమైన కస్టమర్లను లాకర్ స్వాధీనం చేయాలని కొన్ని బ్యాంకులు సూచిస్తాయి. లాకర్లో ఉన్న బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకోవచ్చని బ్యాంక్‌లు కస్టమర్లకు చెబుతుంటాయి. అలా చేస్తే రుణంపై ప్రాసెసింగ్ చార్జీలు, వ్యాల్యూయర్ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. గోల్డ్ లోన్ ఓవర్‌డ్రాఫ్ట్ సుదుపాయంలో.. కావాల్సినప్పుడే రుణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. వినియోగించుకున్నప్పుడు రుణంపై నామమాత్రపు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వినియోగించుకోకపోతే లాకర్ చార్జీల కంటే తక్కువే చెల్లిస్తే సరిపోతుంది. కానీ, దీని కంటే కూడా లాకర్లో ఉంచిన ఒకటి రెండు ఆభరణాలపై నేరుగా గోల్డ్ లోన్ తీసుకోవడమే నయం. అంతే కానీ, లాకర్ల ఆధారంగా ఇచ్చే గోల్డ్‌లోన్ కు వెళ్లకపోవడమే మంచిదని నిపుణుల సూచన. (క్లిక్: పన్ను ఆదా.. స్థిరమైన రాబడులు పొందాలంటే ఈ స్కీమ్‌లో చేరాల్సిందే!) -
మనీశ్ సిసోడియా బ్యాంకు లాకర్ చెక్ చేసిన సీబీఐ
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బ్యాంకు లాకర్‌ను తనిఖీ చేశారు సీబీఐ అధికారులు. లిక్కర్ పాలసీలో అవినీతి కేసు విచారణలో భాగంగా మంగళవారం ఉదయం గాజీయాబాద్‌లోని బ్యాంకులో ఈ సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో సిసోడియాతో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేయిస్తున్న విచారణలో తనకు క్లీన్చిట్ లభించిందని సిసోడియా అన్నారు. సీబీఐ అధికారులకు తన లాకర్లో కూడా ఏమీ దొరకలేదని చెప్పుకొచ్చారు. సీబీఐ తనిఖీల నేపథ్యంలో సోమవారమే ఈ విషయంపై ట్వీట్ చేశారు సిసోడియా. ఆగస్టు 19న తన ఇంట్లో 14 గంటలు తనిఖీలు నిర్వహించినప్పుడు సీబీఐకి ఎలాంటి అధారాలు లభించలేదని గుర్తు చేశారు. బ్యాంకు లాకర్లో వెతికినా ఏమీ దొరకదని ముందుగానే చెప్పారు. తన కుటుంబసభ్యులమంతా అధికారులకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందనే ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం 15 మంది నిందితుల్లో మనీశ్ సిసోడియా పేరును కూడా చేర్చింది. ఇప్పటికే ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా బ్యాంకు లాకర్‌ను కూడా చెక్ చేసింది. అవినీతి ఆరోపణలను ఆప్ మొదటి నుంచి ఖండిస్తోంది. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వేలేకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. సిసోడియా ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పింది. చదవండి: మోదీపై కాంగ్రెస్ మహిళా నేత వివాదాస్పద వ్యాఖ్యలు -
నా బ్యాంకు లాకర్ని కూడా సీబీఐ తనీఖీ చేయనుంది! మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పై సీబీఐ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇపుడు తాజగా మంగళవారం ఆయన బ్యాక్ లాకర్‌ను కూడా సీబీఏ తనీఖీ చేయనుందని తెలిపారు. ఐతే సీబీఏ ఏమి కనుగొనలేదని ధీమాగా చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సుమారు 15 మంది వ్యక్తులు, సంస్థల పై కేసు నమోదు చేసింది. ఈ అభియోగాలతో ఆగస్టు19న ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ సిసోడియా నివాసంతో సహా సుమారు 31 ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో సిసోడియా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 19న తన ఇంటిలో సుమారు 14 గంటల పాటు సీబీఐ నిర్వహించిన దాడుల్లో వారికి ఏమి దొరకలేదు, కాబట్టి ఇప్పడు కూడా వారికి ఏమి దొరకదు అని నమ్మకంగా చెప్పారు. తాను సీబీఐని స్వాగతిస్తున్నానని, తాను తన కుటుంబసభ్యులు విచారణకు పూర్తిగా సహకారం అందిస్తాం అని డిప్యూటి సీఎం సిసోడియా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. कल CBI हमारा बैंक लॉकर देखने आ रही है. 19 अगस्त को मेरे घर पर 14 घंटे की रेड में कुछ नहीं मिला था. लॉकर में भी कुछ नहीं मिलेगा. CBI का स्वागत है. जाँच में मेरा और मेरे परिवार का पूरा सहयोग रहेगा. — Manish Sisodia (@msisodia) August 29, 2022 (చదవండి: కేంద్ర ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపిస్తాం! మమత స్ట్రాంగ్ వార్నింగ్) -
హైదరాబాద్: జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం
-
కస్టమర్లకు గట్టి షాక్ ఇచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్..!
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) తన ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఖాతాదారులకు అందించే సేవలకు సంబంధించిన చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు జనవరి 15 నుంచి అమలులోకి వస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది. కనీస ఖాతా బ్యాలన్స్, బ్యాంక్ లాకర్ ఛార్జీలు, క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు పెంచిన జాబితాలో ఉన్నాయి. కనీస బ్యాలెన్స్: మెట్రో ప్రాంతంలో త్రైమాసిక సగటు బ్యాలెన్స్(క్యూఎబి) పరిమితిని ₹10,000కు పెంచారు. ఇంతకు ముందు పరిమితి ₹5,000గా ఉండేది. త్రైమాసిక కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు గ్రామీణ ప్రాంతాల్లో రుసుమును ₹200 నుంచి ₹400కు, పట్టణ & మెట్రో ప్రాంతాల్లో ₹300 నుంచి ₹600పెంచినట్లు పీఎన్బీ తెలిపింది. బ్యాంక్ లాకర్ ఛార్జీలు: పీఎన్బీ గ్రామీణ, సెమీ అర్బన్, పట్టణ & మెట్రో ప్రాంతాల్లో తన లాకర్ అద్దె ఛార్జీలను కూడా పెంచింది. పట్టణ ప్రాంతాల్లో లాకర్ ఛార్జీలను ₹500 పెంచారు. బ్యాంక్ లాకర్: జనవరి 15, 2021 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చిన తర్వాత లాకర్ ని ఏడాదికి ఉచితంగా చూసే సంఖ్య 12(ఇంతకముందు 15)కు తగ్గుతుంది. ఆ తర్వాత లాకర్ తెరిచిన ప్రతిసారి ₹100 చెల్లించాల్సి ఉంటుంది. కరెంట్ అకౌంట్ మూసివేత ఛార్జీలు: కరెంటు ఖాతా తెరిచిన 14 రోజుల తర్వాత ఖాతాను రద్దు చేస్తే రూ.800 అపరాధ రుసుము చెల్లించాలి. ఇంతకు ముందు ఇది రూ.600గా ఉండేది. కరెంటు ఖాతా తెరిచిన 12 నెలల తరువాత రద్దు చేస్తే ఎలాంటి ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు. పొదుపు ఖాతా లావాదేవీల రుసుము: జనవరి 15 నుంచి పీఎన్బీ నెలకు 3 ఉచిత లావాదేవీలను చేసుకునే అనుమతిస్తుంది. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి ₹50/(బీఎన్ఏ, ఏటీఎమ్, సిడీఎమ్ వంటి ప్రత్నామ్నాయ ఛానళ్లు మినహాయించి) ఛార్జ్ చేస్తుంది. అలాగే, సీనియర్ సిటిజన్ ఖాతాలకు ఇది వర్తించదు. ఇంకా పొదుపు, కరెంట్ ఖాతాల్లో లావాదేవీ ఫీజులను కూడా పెంచింది. ప్రస్తుతం బ్యాంక్ బేస్, నాన్-బేస్ బ్రాంచ్‌లకు ప్రస్తుతం 5 ఉచిత లావాదేవీలను బ్యాంకు అనుమతిస్తుంది. ఆ తర్వాత ఆపై చేసే ప్రతి లావాదేవీకి రూ.25 ఛార్జ్ చేస్తుంది. క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు: పొదుపు, కరెంట్ ఖాతాల రెండింటిపై కూడా నగదు డిపాజిట్ పరిమితిని తగ్గించింది. రోజుకు ఉచిత డిపాజిట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న ₹2 లక్షల నుంచి ₹1 లక్షకు తగ్గించింది. (చదవండి: శాంసంగ్ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ సేవలు పూర్తిగా బంద్..!) -
బ్యాంకు లాకర్లో రూ.500 కోట్లు విలువ చేసే మరకత లింగం
సాక్షి, చెన్నై: తంజావూరులోని ఓ వ్యక్తి బ్యాంకు లాకర్లో రూ.500 కోట్లు విలువ చేసే పచ్చవర్ణ మరకత(ఎమరాల్డ్) లింగం బయట పడింది. తిరుక్కువలై ఆలయంలో అపహరణకు గురైన ఆ విగ్రహం లాకర్లోకి ఎలా వచ్చిందనే విషయాన్ని తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తంజావూరు అరులానందనగర్‌లోని ఓ ఇంట్లో పురాతన విగ్రహం ఉన్నట్టు చెన్నైలోని విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగానికి సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందం శుక్రవారం ఆ ఇంట్లోని అరుణా భాస్కర్‌ను ప్రశ్నించారు. తమ ఇంట్లో ఏమీ లేవని, తన తండ్రి స్వామియప్పన్ మరణించారని, అంతకుముందు ఆయన వద్ద ఉన్న మరకత లింగం బ్యాంక్ లాకర్లో ఉండొచ్చని చెప్పారు. దీంతో బృందం లాకర్‌ను తెరిచి చూశారు. అందులో పచ్చవర్ణ మరకత లింగం బయట పడింది. దీని విలువ రూ.500 కోట్లు ఉంటుందని అంచనా. ఆ విగ్రహం మైలాడుతురై జిల్లా శీర్గాలి సమీపంలోని తిరుక్కువలై శివాలయంలో మూడేళ్ల క్రితం చోరీకి గురైనట్టు తేలింది. దీంతో అధికారులు శనివారం ఆ విగ్రహాన్ని చెన్నైలోని కార్యాలయంలో భద్రపరిచారు. -
‘మాయా’ శిల్పం: లాకరుంది.. డబ్బుల్లేవు
మణికొండ: అధిక వడ్డీలు, రియల్ వ్యాపారా లంటూ సంపన్న మహిళల నుంచి రూ. కోట్లు దండుకున్న శిల్పా చౌదరిని నార్సింగి పోలీసులు మూడోసారి విచారించారు. బెయిల్ పిటిషన్‌ను సోమవారం రాజేంద్రనగర్ కోర్టు రద్దు చేసి మరోసారి పోలీసు కస్టడీకి అనుమతించటంతో మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి నార్సింగికి ఆమెను తీసుకొచ్చారు. తర్వాత కోకాపేటలోని యాక్సిస్ బ్యాంక్‌కు తీసుకెళ్లి లాకర్‌ను తెరిపించారు. అందులో డబ్బు లేకపోవటంతో పోలీసులు నిరాశ చెందారు. ఓ ఆస్పత్రి సొసైటీ పత్రాలు, గండిపేటలోని తన సిగ్నేచర్ విల్లా జిరాక్స్ పత్రాలు ఉంటే వాటిని స్వాధీనం చేసుకున్నారు. డబ్బులేం చేశావని అడిగితే.. ఫిర్యాదు చేసిన మహిళల నుంచి తీసుకున్న డబ్బును ఏం చేశావని, బినామీ పేర్లతో ఎక్కడ ఆస్తులు కొన్నావని శిల్పను పోలీసులు ప్రశ్నించారు. దానికి జవాబుగా హయత్‌నగర్‌లో తనకు 240 గజాల భూమి ఉందని, విల్లా.. బ్యాంక్ లోన్‌లో ఉందని, బయటకు రాగానే వాటిని అమ్మి డబ్బులు ఇచ్చిన వారికి తిరిగి ఇచ్చేస్తానని చెప్పినట్టు తెలిసింది. హాస్పిటల్ సొసైటీలో పెట్టుబడులు పెట్టినట్టు, అందులో మోసపోయానని చెప్పినట్టు సమాచారం. యాక్సిస్ బ్యాంక్‌కు వచ్చిన సందర్భంగా మీడియా శిల్పను తన వాదన చెప్పాలని కోరగా వాళ్లను తప్పించుకుని పోలీసు వాహనం ఎక్కింది. ఆమెను బుధవారం తిరిగి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. పక్కా స్కెచ్‌తోనే.. సంపన్న మహిళలే టార్గెట్‌గా వారితో ఫ్రెండ్షిప్ చేసిందని, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వారిని కిట్టీ పార్టీలకు పిలిచి పక్కా స్కెచ్‌తోనే డబ్బు దండుకుని ఎక్కడ పెట్టిందో చెప్పట్లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి నుంచి డబ్బు తీసుకుని కొన్ని నెలలు వడ్డీ చెల్లించడం, తీరా విషయం పోలీసు స్టేషన్‌కు వచ్చిందనగానే అకౌంట్లు, లాకర్లలో డబ్బుల్లేకుండా చేయటం, విచారణలో నోరు విప్పకపోవటం వాటికి బలం చేకూరుస్తున్నాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. తనకు డబ్బులు ఇచ్చే వారిని ముంచాలనే తరచూ కిట్టీ పార్టీలను ఏర్పాటు చేసి వాటిల్లో తనకు లేని దర్పాన్ని ప్రదర్శించగా ఆ ఎత్తుకు కొందరు మహిళలు చిక్కి మోసపోయారని పలువురు చెబుతున్నారు. వారికి న్యాయం చేసేందుకు పోలీసులు ఎంతలా ప్రయత్నించినా ఫలితం ఆశించినంతగా దక్కలేదని అంటున్నారు. -
నాగరాజు లాకర్లో 1.5 కిలోల బంగారం
సాక్షి, హైదరాబాద్: కీసర తహసీల్దార్ నాగరాజుకు చెందిన బ్యాంకు లాకర్‌ను ఎట్టకేలకు ఏసీబీ అధికారులు బుధవారం తెరిచారు. అల్వాల్‌లోని ఓ బ్యాంక్ లాకర్ నుంచి కిలోన్నర బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 14వ తేదీన నాగరాజు ఇంటిపైన దాడి చేసిన సమయంలో ఏసీబీ అధికారులకు ఓ బ్యాంకు లాకర్‌కు చెందిన తాళంచెవి లభించింది. అది నాగరాజు బంధువైన జి.జే.నరేందర్ పేరిట అల్వాల్‌లోని సౌత్ ఇండియన్ బ్యాంకు లాకర్‌గా ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనూ నాగరాజు లాకర్ విషయంలో సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు సదరు లాకర్‌ను తెరిచిన ఏసీబీ అధికారులకు అందులో 1532 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని సీజ్ చేసిన ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్ చేయనున్నారు. (కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు) మరోవైపు నాగరాజు అవినీతిపై రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. గత నెల 14న రూ.కోటి పది లక్షల నగదు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం జాతీయస్థాయిలో కలకలం రేపింది. అతడి బాధితుల్లో సామాన్యుల నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు. ఇప్పుడు వారంతా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. నాగరాజు వేధింపులకు గురైన ఓ ఎస్పీ ర్యాంకు మాజీ పోలీస్ అధికారి మీడియా ముందుకు అతడి అవినీతి బాగోతం వివరించారు. కస్టడీ ముగిసినా దరిమిలా నాగరాజు అక్రమాలపై ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.ఇక నాగరాజు వేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. రెండు రోజుల్లో ఏసీబీ న్యాయస్థానం బెయిల్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
బంగారం చోరీ చేసిన నిందితుడి అరెస్టు
లాకర్లోని మూడు కేజీల నూట అరవై నాలుగు గ్రాముల బంగారాన్ని చోరీ చేసిన నిందితుడ్ని పోలీసులు పట్టుకున్న సంఘటన మంగళవారం ఆకివీడులో జరిగింది. ఈ నెల 20వ తేదీ అకివీడులోని కార్పొరేషన్ బ్యాంక్‌లో 3కేజీల 164 గ్రాముల బంగారాన్ని ఓ వ్యక్తి లాకర్లో దాచుకున్నాడు. దీనిని గమనించిన బ్యాంక్ అప్రయిజ్ కె. వరప్రసాద్ లాకర్లోని బంగారాన్ని చోరీ చేశాడు. చోరీ చేసిన బంగారం విలువ 68.20 లక్షలు ఉంటుంది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడ్ని మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మూడు కేజీల నూట ముప్పయి ఆరు గ్రాములు బంగారాన్ని రికవరీ చేశారు. -
రూ.కోట్లు మింగిన నాగ‘మణి’
ఎమ్మిగనూరులో ఘరానా మోసం తేలు కుట్టిన దొంగల్లా బాధితులు ఎమ్మిగనూరు: నాగుపాములు, నాగమణుల సబ్జెక్టుతో తెరకెక్కిన సినిమాలన్నీ విజ యాలు సాధించినవే. అదే సూత్రంతో ఓ ఇద్దరు ఎమ్మిగనూరులో పలు వ్యాపారులకు వెర్రెక్కించారు. నాగమణి ఆశ చూపి రూ.కోట్లు వసూలు చేశారు. అసలు ఉందో లేదో తెలియని మణి కోసం ఇళ్లు, వాకిలి తాకట్టు పెట్టిన వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఎమ్మిగనూరు సమీపంలోని అగ్రహారం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్, మరో స్వీటు వ్యాపారి కలసి నాగ‘మణి’ పేరిట జనాలను బుట్టలో వేశారు. రూ.కోట్లు విలువ చేసే మణి కర్ణాటకలోని ఓ బ్యాంకు లాకర్లో ఉందని, మలేషియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రమే లాకర్‌ను తెరువగలడని జోరుగా ప్రచారం చేశారు. మణితో తమ దశ తిరుగుతుందన్న అత్యాశతో కొందరు రూ.రెండు కోట్ల నుంచి లక్షల్లో వారికి ముట్టజెప్పారు. మొత్తం రూ.8 కోట్లు వసూలు చేశారు. ఆ మొత్తాన్ని మలేసియాకు చెందిన వ్యక్తికి అప్పగించామని, తొందర్లోనే మణి వస్తుందని ఆరునెలలుగా నమ్మబలుకుతున్నారు. వీరికి డబ్బులిచ్చి మోసపోయిన వ్యక్తి సోదరులు పోలీసు శాఖలో పని చేస్తున్నారు. తమ అన్నకు జరిగిన మోసాన్ని తెలుసుకుని అగ్రహారం ఏజెంట్‌ను ప్రశ్నించగా., జూలై 15 లోగా రూ.50 లక్షలు తిరిగిచ్చేస్తామని, ఈ వ్యవహారం బయటకు పొక్కనివ్వొద్దంటూ వేడుకున్నట్టు తెలిసింది. కాగా, ఈ ఏడాది మార్చిలో రెండు సార్లు మలేిసియా వెళ్లి వచ్చినట్టు సమాచారం. మణి పేరిట వసూలు చేసిన మొత్తం ఏం చేశారో.? డబ్బు తిరిగి ఎలా చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు మణి మాయలో వీరికి డబ్బులు సమర్పించిన బాధితులు.., బయటకు చెప్పుకోలేక తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. -
ఎక్సైజ్ సీఐ లాకర్లో రూ.10 లక్షల సొత్తు
రాజమండ్రి రూరల్ (తూర్పు గోదావరి), న్యూస్‌లైన్ : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చిక్కిన ఎక్సైజ్ సీఐ యామల జయరాజుకు చెందిన బ్యాంకు లాకర్లో రూ.10 లక్షల సొత్తును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉయ్యూరు ఎక్సైజ్ సీఐ జయరాజుకు చెందిన రాజమండ్రి గణేష్‌నగర్‌లోని ఇంటితో పాటు మరో 8 చోట్ల ఏకకాలంలో దాడులు చేసిన విషయం విదితమే. ఈ దాడుల్లో రూ.2 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. అతడి ఇంట్లో దొరికిన తాళంతో గురువారం రాజమండ్రి అల్కాట్‌తోట ఆంధ్రాబ్యాంక్ బ్రాంచిలోని లాకర్‌ను ఏలూరు ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది తెరిపించారు. అందులో రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులున్నట్టు గుర్తించారు. వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జయరాజును విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్టు డీఎస్పీ తెలిపారు. -
అవినీతి గని
సాక్షి, విశాఖపట్నం/పెదవాల్తేరు, న్యూస్‌లైన్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుస దాడులతో అవినీతి అధికారులు హడలి పోతున్నారు. ఇటీవల శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వరరావు, వుడా డీఎఫ్ఓ శంబంగి రామ్మోహన్, మొన్న విశాఖ అర్బన్ డీఎస్ఓ జ్వాలా ప్రకాష్ తాజాగా విశాఖ మైనిం గ్ అండ్ జియాలజీ(విజిలెన్స్) అసిస్టెంట్ డెరైక్టర్ మన్యం సుబ్రహ్మణ్యం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఈయనకు రూ.10 కోట్లు వరకు ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు తేల్చారు. వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తవ్వేకొద్దీ... : తాజాగా ఏసీబీకి పట్టుబడ్డ మైనింగ్ ఏడీ సుబ్రహ్మణ్యం ఆస్తుల లెక్క తేల్చడానికి ఒక రోజు సమయం సరిపోలేదు. రాష్ట్రంలో పలుచోట్ల అక్రమాస్తులు ఉండడంతో శుక్రవారం రాత్రైనా సోదాలు ఆగలేదు. కడపటి సమాచారం మేరకు ఆదాయానికి మించి రూ.10 కోట్లు అదనపు ఆస్తులున్నట్టు తేలింది. ఈ అంకె ఇంకా పెరగొచ్చని ఏసీబీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సుబ్రహ్మణ్యానికి సం బంధించి శుక్రవారం తెల్లవారుజామున రాష్ట్రం లోని ఏడుచోట్ల సోదాలు ప్రారంభించారు. విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో దాదాపు 10 బృం దాలు సోదాలు నిర్వహించాయి. ఏసీబీ డీఎస్పీ నర్సింహారావు నేతృత్వంలో సీఐలు రామకృష్ణ, రమణరావు, రాఘవరావు ఒక బృందంగా నగరంలోని హెచ్‌బీ కాలనీలోని సుబ్రహ్మణ్యం ఇంట్లో, మురళీనగర్‌లోని మైనింగ్ అండ్ జియాలజీ(విజిలెన్స్) ఏడీ కార్యాలయంలో సోదాలు చేశారు. మిగతా తొ మ్మిది బృందాలు సుబ్రహ్మణ్యం స్వస్థలం గుంటూ రు జిల్లా గుల్లపల్లి, సమీప బంధువులున్న కంకిపా డు, కృష్ణా జిల్లాలోని పలుచోట్ల సోదాలు చేశాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అక్రమాస్తులు ఉన్నట్టు తేల్చాయి. బయటపడ్డ ఆస్తులివే : కృష్ణా, గుంటూరు జిల్లాలో 20 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తించారు. విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాలో మూడు ఇళ్లు ఉన్నట్టు నిర్ధారించారు. లక్షలాది రూపాయలు విలువైన బీమా పత్రాలు, రెండు వాహనాలు, బ్యాంక్ లాకర్, విలువైన బం గారు ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు. ఒక్క విశాఖ లోని హెచ్‌బీ కాలనీలోని ఇళ్లే సుమారు రూ.2 కోట్లు విలువ ఉంటుందని అంచనా వేశారు. ఈ లెక్కన స్టాంప్ డ్యూటీ ప్రకారం రూ.కోటి70 లక్షలు అదనపు ఆస్తులున్నట్టు ప్రాథమిక విలువ కట్టారు. మార్కెట్ విలువ ప్రకారమైతే రూ.10 కోట్లు ఉండొచ్చని ఏసీబీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 1990లో అసిస్టెంట్ టెక్నిషియన్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన సుబ్రహ్మణ్యం దశల వారీగా పదోన్నతులు పొందారు. 2006లో అసిస్టెంట్ డెరైక్టర్‌గా పదొన్నతి పొందిన ఆయన గుంటూరు, ఏలూరు, విజయవాడ, శ్రీకాకుళం జిల్లాల్లో పనిచేశారు. సుబ్రహ్మణ్యం తండ్రి సాధారణ వ్యవసాయ రైతే. కానీ ఉద్యోగంలో చేరిన తర్వాత పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. 2001లో కూడా సుబ్రహ్మణ్యంపై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న అభియోగంతో ఏసీబీ అధికారులు అకస్మిక దాడులు చేసినట్టు తెలిసింది. -
కేదార్‌నాథ్‌లో బయటపడ్డ రూ.1.90 కోట్ల నగదు
డెహ్రాడూన్: ప్రకృతి విలయానికి మరుభూమిగా మారిన ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయం వెలుపల కోటి 90 లక్షల రూపాయల నగదు గల బ్యాంక్ లాకర్ బయటపడింది. వరదల ధాటికి దెబ్బతిన్న ఉత్తరాఖాండ్‌లోని ఈ పుణ్యక్షేత్రం పునరుద్ధరణ చర్యల్లో భాగంగా బురద, బండరాళ్లను తొలగిస్తుండగా ఈ నెల 11న దీన్ని కనుగొన్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్‌కు చెందిన లాకర్‌గా గుర్తించినట్టు ఓ సినీయర్ పోలీస్ అధికారి ఒకరు ఆదివారం చెప్పారు. వెంటనే డెహ్రాడూన్ ఎస్బీఐ అధికారులను ఈ సమాచారాన్ని చేరవేశారు. పోలీసులు, బ్యాంక్ అధికారుల సమక్షంలో శనివారం ఈ లాకర్‌ను తెరవగా భారీ మొత్తం ఉన్నట్టు గుర్తించారు. ఈ నగదును ఎస్బీఐ చీఫ్ మేనేజర్ అనూప్ లంబాకు అప్పగించినట్టు రుద్రప్రయాగ ఎస్సీ వరీందర్ జీత్ సింగ్ చెప్పారు. చమోలీ జిల్లాలోనూ ఇటీవల ౩౩ లక్షల రూపాయల గల బ్యాంక్ లాకర్‌ను కనుగొన్నారు. భారీ వర్షాలు, వరదల ధాటికి కేదార్నాథ్ తదితర ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విపత్తులో ఎస్బీఐ కార్యాలయం ఉన్న భవనం ధ్వంసమైంది. -
జిల్లాలో నేరాల నివారణకు కృషి
రాయచూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో దోపిడీలు, దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు కళ్లెం వేయడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తామని ఇటీవల బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ ఎంఎన్.నాగరాజ్ తెలిపారు. ఆయన గురువారం ఏఎస్పీ అశోక్, రూరల్ సీఐ రమేష్ మేటితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యంగా అత్యంత విలువైన బంగారు నగలు, నగదు అవసరమైతే తప్ప ఇంట్లో పెట్టుకోరాదని, బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. జిల్లాలో ఇటీవల జరిగిన దోపిడీలు, దొంగతనాలపై దర్యాప్తునకు డీఎస్పీ సిప్పార్, డీసీఆర్బీ కరుణేష్గౌడ సారథ్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. బళ్లారి నగరంలో, తోరణగల్లులో జరిగిన దోపిడీ ఘటనల్లో దుండగులు వాడిన మారణాయుధాలు, వారి సంఖ్య, జిల్లాలోని లింగసూగూరులో జరిగిన దోపిడీ ఘటనకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయన్నారు. ఈ విషయంలో బళ్లారి జిల్లా ఎస్పీతో సంప్రదిస్తున్నామన్నారు. దొంగల ఆట కట్టించేందుకు సమన్వయంతో పని చేయాలని తాము నిర్ణయించుకున్నామన్నారు. ఇది ఒకే ముఠా పనే నా? అన్నది త్వరలో నిగ్గు తేలుస్తామన్నారు. నేరాల అదుపులో ప్రజల భాగస్వామ్యం కోసం కర పత్రాలను ఇంటింటికీ పంపిణీ చేసి తగినంత చైతన్యం తెస్తున్నామన్నారు. అందులో భాగంగా ఇరుగు పొరుగు కాపలా సమితిని ఏర్పాటు చేశామని, ఇందులో యువజనుల సేవలను వినియోగించుకుంటున్నామన్నారు. రాయచూరులోని జహీరాబాద్ ధనలక్ష్మి లేఔట్లో మంగళవారం పట్టపగలు జరిగిన దోపిడీకి సంబంధించి దర్యాప్తు జరుగుతోందన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ చేతులు, కాళ్లు కట్టేసి దుండగులు 300 గ్రాముల బంగారాన్ని దోచుకున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఘటన జరిగిన మరుసటి రోజే గుడ్‌మార్నింగ్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతంలోని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో 8 శాతం పోలీస్ సిబ్బంది కొరత ఉందన్నారు. అక్రమ మద్యం,ఇసుక అక్రమ రవాణను అరికట్టేందుకు సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆటో డ్రైవర్లు వినియోగదారులను వంచించే ప్రకటనలపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.వివిధ వాహనాలపై ‘ప్రెస్’ అని రాసుకుని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బళ్లారి అక్రమ గనులలో తమ పేరు ఉంది కదా? అన్న ప్రశ్నకు ఏదో ఒక పత్రిక అలా రాసిందన్నారు. బళ్లారిలో 8 నెలలు పాటు మాత్రమే తాను ఎస్పీగా పని చేశానన్నారు.