మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌ వద్ద ధర్నా | mrutadehamto dharna | Sakshi
Sakshi News home page

మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌ వద్ద ధర్నా

Published Wed, Aug 17 2016 11:43 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

mrutadehamto dharna

నిడదవోలు : ఒడిశాలో అనుమానాస్పదంగా మృతిచెందిన దళిత యువకుడు, లారీడ్రైవర్‌ మోసుగంటి వరప్రసాద్‌(42)ది హత్యేనని ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ రాష్ట్ర కన్వీనర్‌ పిల్లి డేవిడ్‌ కుమార్‌ ఆరోపించారు. వరప్రసాద్‌ మృతదేహంతో కుటుంబ సభ్యులు, దళితులు బుధవారం మండలంలోని సమిశ్రగూడెం పోలీస్‌ స్టేషన్‌ వద్ద భారీ ఎత్తున  ధర్నా చేశారు.   డేవిడ్‌కుమార్‌ మాట్లాడుతూ.. వరప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరిస్తున్నారని, అతనిది హత్యేనని, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..  వరప్రసాద్‌ వద్దకు ఇటీవల పెరవలి మండలం నడుపల్లికోటకు చెందిన షేక్‌ వలీ వచ్చి ఖండవల్లికి చెందిన లారీ ఓనర్‌ రవి(బాబి)కి రూ.3000 అప్పు ఉన్నావు కదా, అందుకు ఆయన లారీపై పనిచేయాలని చెప్పాడు. లేకుంటే ఆయన నిన్ను ఏదో ఒకటి చేస్తాడని బెదిరించి వరప్రసాద్‌ను డ్యూటీకి తీసుకెళ్లాడు. ఈనెల 14న లారీ ఓనర్‌ రవి పెండ్యాలకు వచ్చి వరప్రసాద్‌ ఆచూకీ తెలియడం లేదని, ఫోన్‌ పనిచేయడం లేదని అతని భార్య శ్రీలతతో చెప్పాడు. తిరిగి లారీ ఓనర్‌ ఈనెల 15న మృతుడు తల్లికి ఫోన్‌చేసి ఒడిశా రావాలని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లగా, ఓ మెడికల్‌ కాలేజీలో మృతదేహానికి పోస్టుమార్టం చేసి ఓ పక్కన ఉంచారు. ఏమైందని అడిగితే వరప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నాడని, ఓనర్‌ అంబులెన్సులో మృతదేహాన్ని పెట్టి కనిపించకుండా పోయాడని చెప్పారు. దీంతో దళిత నాయకులు మృతదేహాన్ని పరిశీలించి హత్యగా నిర్ధారించారు. న్యాయం చేయాలని కోరుతూ సమిశ్రగూడెం పోలీస్‌స్టేçÙన్‌ వద్ద బుధవారం ధర్నా చేశారు. హత్యకేసు నమోదు చేసి, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నిందితులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వరప్రసాద్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement