విగ్రహాలు తొలగించడం పద్ధతికాదు
సూళ్లూరుపేట : మహానాయకులు విగ్రహాలు తొలగించడం మంచి పద్ధతి కాదని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ అన్నారు. పుష్కరాల పేరుతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని తీసేయడం క్షమించరాని నేరమని చెప్పారు. సూళ్లూరుపేటలోని పరమేశ్వరీనగర్‌లో ఉన్న ఎంపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ మెతకSవైఖరివల్లే ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ విషయంలో మొండిచేయి చూపించారన్నారు. 2వ తేదీన జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 2న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతంగా చేయడానికి పార్టీ శ్రేణులంతా కృషి చేసి బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
షార్ సహకారంతో..
తీరప్రాంత గ్రామాలైన రాగెన్నపట్టెడ, పేర్నాడుల్లో రూ.40 లక్షలతో ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణానికి సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్) కేంద్రం వారు. సుమఖంగా ఉన్నతారని ఎంపీ తెలిపారు. పట్టణంలో కూరగాయల మార్కెట్ నిర్మాణానికి ముందుకొచ్చారన్నారు. సూళ్లూరులో శ్మశానవాటికను అభివృద్ధి చేయడానికి ఎంపీ ల్యాడ్స్‌నుంచి రూ.20 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. పట్టణానికి మధ్యలో ఉన్న రైల్వేగేట్‌కు సబ్‌వే నిర్మాణంపై రైల్వేమంత్రి సురేష్‌ప్రభుతో మాట్టాడగా ఆయన ఒప్పుకున్నారని, అయితే నిధులు తమ వద్ద లేవని మీరే సమీకరించుకుని చేసుకోమని చెప్పారని వెల్లడించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు వంకా రామాంజనేయులు, పోకల దుష్యంతయ్య, గోపాలకష్ణయ్య, దామనెల్లూరు ఎంపీటీసీ సభ్యుడు దాసరి జయరామయ్య, సుల్తాన్‌బాషా, వంకా దినేష్ పాల్గొన్నారు.