హోదా ఇవ్వకపోవడం మోసగించడమే | Status does not deceiving | Sakshi
Sakshi News home page

హోదా ఇవ్వకపోవడం మోసగించడమే

Published Wed, Feb 8 2017 2:48 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

హోదా ఇవ్వకపోవడం మోసగించడమే - Sakshi

హోదా ఇవ్వకపోవడం మోసగించడమే

ధన్యవాద తీర్మానంపై ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగంలో ఏపీకి ప్రత్యేక హోదా అమలు విషయం లేదని, ప్రత్యేక హోదా అమలు చేయక పోవడం రాష్ట్ర ప్రజలను మోసగించడమే అవుతుందని వైఎస్సార్‌ సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు పేర్కొ న్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మా నంపై జరిగిన చర్చలో ఆయన తన ప్రసంగాన్ని సభకు సమర్పించారు. ‘ప్రత్యేక హోదా అమలుచేయకపోవడం రాష్ట్ర ప్రజలను మోస గించడమే.

అన్ని ప్రముఖ జాతీయ పార్టీలు, నాయకులు హామీ ఇచ్చిన విధంగా ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలి. అలాగే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ను ప్రకటించాలి..’ అని ఆయన డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేవలం 55 వేల గ్యాస్‌ కనెక్షన్లు మంజరు చేశారన్నారు. స్టాండ్‌ అప్‌ ఇండియా స్కీమ్‌ బాగున్నా.. ఎస్సీ, ఎస్టీల రుణాలకు తగినన్ని నిధులు కేటాయించలేదన్నారు. తిరుపతి నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ పూర్తిస్థాయిలో పని దినాలు కల్పించలేదని పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement