సత్తా ఉంటే రాజీనామా చేసి గెలవాలి | MP Vara Prasad Rao commented on MLA paasam Sunil | Sakshi
Sakshi News home page

సత్తా ఉంటే రాజీనామా చేసి గెలవాలి

Published Mon, Apr 11 2016 5:13 AM | Last Updated on Thu, Aug 9 2018 4:32 PM

సత్తా ఉంటే   రాజీనామా చేసి గెలవాలి - Sakshi

సత్తా ఉంటే రాజీనామా చేసి గెలవాలి

పాశం సునీల్‌కు ఎంపీ వరప్రసాద్‌రావు హితవు

వాకాడు: గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కు సత్తా ఉంటే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలని తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. వాకాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు డాక్టర్ నేదురుమల్లి పద్మనాభరెడ్డి నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పార్టీ నుంచి పిరికివాడిలా పారిపోవడం దారుణమన్నారు. ఆయన్ను మొదటిసారి ఎమ్మెల్యే చేసిన గూడూరు నియోజవర్గ ప్రజలకు జీవితాంతం దణ్ణం పెట్టుకోవాలని సూచించారు. విలువల్లేని రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. పాశం సునీల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటం చాలా బాధాకరమన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తేనే తాను ఎంపీగా, సునీల్ గూడూరు ఎమ్మెల్యేగా గెలిచామని వివరించారు.

ఫిరాయింపులను చంద్రబాబు ప్రోత్సహించడం దారుణమన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని చంద్రబాబు చూడటం అన్యాయమని చెప్పారు. అనంతరం పద్మనాభరెడ్డి మాట్లాడారు. వరప్రసాద్‌రావు ఎంపీగా గెలిచిన అనంతరం మండలాల్లో అనేక సార్లు తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకొని నిధులను కేటాయిస్తున్నారని కొనియాడారు.

అనంతరం పాపారెడ్డి మనోజ్‌కుమార్‌రెడ్డి కుటుంబసభ్యులను కలిశారు. పార్టీ మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయ్‌శేఖర్‌రెడ్డి, కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, నేదురుమల్లి శ్రీధర్‌రెడ్డి, కోట ఎంపీటీసీ దారా సురేష్, నాయకులు దుష్యంతయ్య శెట్టి, తుమ్మల మోహన్‌నాయుడు, ఎస్సీ సెల్ అధ్యక్షులు అడపాల ఏడుకొండలు, సుధాకర్‌రెడ్డి, గాది భాస్కర్, కుంబాల మస్తానయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement