సాక్షి, అమరావతి: ఆంగ్ల విద్యపై ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారా? అని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంగ్ల భాషను తీసుకురావడం వల్ల అణగారిన వర్గాల్లో నూతనోత్తేజం వచ్చిందన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఆంగ్ల విద్యా విధానం తీసుకురావడం శుభపరిణామం. ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. నేను ఆంగ్ల భాషలో చదువుకోవడం వల్లే ఉన్నతస్థాయికి వచ్చానని గర్వంగా చెబుతున్నా. రిటైర్డ్ ఐఏఎస్, మాజీ ఎంపీగా ఆంగ్ల భాషలో పట్టు ఉండటం వల్లే నేను మంచి పేరు సంపాదించా’నని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment