సరిహద్దు ప్రజలకు న్యాయం చేయండి
లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి
న్యూఢిల్లీ: భారత్, బంగ్లా మధ్య గల వివాదాస్పద సరిహద్దులో ఉన్న ప్రజలకు న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు కేంద్రాన్ని కోరారు. ఈ సరిహద్దులో ఉన్న త్రిపుర, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ పరిధిలో దాదాపు 54 వేల మంది నివసిస్తున్న ప్రాంతం రెండు దేశాలకు చెందకుండా వివాదాస్పద సరిహద్దుగా ఉంది.
దీనికి తెరదించుతూ కేంద్రం భూ సరిహద్దు ఒప్పందంపై 119వ రాజ్యాంగ సవరణ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిపై చర్చలో పాల్గొన్న ఎంపీ ఈ బిల్లు కారణంగా 34 వేల మంది భారత్‌కు, 18 వేల మంది బంగ్లాదేశ్‌కు చెందేలా.. 260 ఎకరాలు బంగ్లాదేశ్‌కు, 174 ఎకరాలు భారత్‌కు వచ్చేలా చేస్తూ తెచ్చిన ఈ బిల్లును స్వాగతిస్తున్నట్టు తెలిపారు.