disputed border
-
భారత్, చైనా సరిహద్దుల్లో సైనికీకరణ ఆందోళనకరం
జెనీవా: తూర్పు లద్ధాఖ్‌లో భారత్–చైనా సరిహద్దులో నాలుగేళ్ల క్రితం మొదలైన ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యం వెనక్కి వెళ్లిపోయే విషయంలో చైనాతో నెలకొన్న సమస్యలు 75 శాతం పరిష్కారమైనట్లు తెలిపారు. చేయాల్సింది ఇంకా మిగిలే ఉందని పేర్కొన్నారు. గురువారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఓ చర్చా కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడారు. 2020లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలు భారత్–చైనా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఉంటేనే ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడతాయని ఉద్ఘాటించారు. భారత్, చైనా సైన్యం మధ్య ఘర్షణలకు పూర్తిగా తెరదించడానికి నాలుగేళ్లుగా చర్చలు జరుగుతున్నాయని వివరించారు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంబడి భారత్, చైనా సైన్యం వెనక్కి వెళ్తుండగా, మరోవైపు అక్కడ మిగిలి ఉన్న రెండు దేశాల సేనలు ఎదురెదురుగా సమీపంలోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. సరిహద్దుల్లో సైనికీకరణ జరుగుతోందని వెల్లడించారు. ఈ సమస్యను కచి్చతంగా పరిష్కరించాల్సి ఉందన్నారు. సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయం తూర్పు లద్దాఖ్‌లో వివాదాస్పద సరిహద్దుల నుంచి తమ సేనలను సాధ్యమైనంత త్వరగా పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలను వేగవంతం, రెట్టింపు చేయాలని తీర్మానించుకున్నాయి. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని తాము కోరుకుంటున్నామని అజిత్ దోవల్ ఈ సందర్భంగా తేలి్చచెప్పారు. వాస్తవా«దీన రేఖను(ఎల్ఏసీ)ని గౌరవించాలని వాంగ్ యీకి సూచించారు. భారత్, చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఎల్ఏసీని గౌరవించాల్సిందేనని స్పష్టంచేశారు. -
కొరియాల మధ్య కొత్త వివాదం
సియోల్: దక్షిణ కొరియా ఉద్యోగి ఒకరిని ఉత్తర కొరియా దళాలు కాల్చి చంపి, మృతదేహాన్ని తగలబెట్టాయి. సరిహద్దు దాటేందుకు ప్రయత్నించినందుకు ఈ పని చేసి ఉండొచ్చని దక్షిణ కొరియా పేర్కొంది. ఆ వ్యక్తిని ఇరుదేశాల మధ్య వివాదాస్పద సరిహద్దులోని జలాల్లో ఒక చిన్న తెప్పలాంటి దానిపై ప్రయాణిస్తుండగా, గుర్తించి అదుపులోకి తీసుకుని చంపేశాయని గురువారం వెల్లడించింది. దక్షిణ కొరియా రక్షణ మంత్రి వెల్లడించిన సమాచారం మేరకు.. అక్రమ చేపల వేటను నిరోధించేందుకు ఉద్దేశించిన ఒక ప్రభుత్వ నౌక నుంచి ఆ ఉద్యోగి కనిపించకుండాపోయారు. ఆ తరువాత వివాదాస్పద జలాల్లో కనిపించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు మొదట నార్త్ కొరియా అధికారులు వెళ్లారు. ఆ తరువాత, కాసేపటికి నౌకాదళ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్లి ఆ వ్యక్తిని కాల్చేశాయి. అనంతరం, ఆ ఉద్యోగిని తగలపెట్టాయి. ఆ ఉద్యోగి ఉత్తర కొరియాలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని దక్షిణ కొరియా రక్షణ శాఖ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే లక్ష్యంతో అక్రమంగా సరిహద్దులు దాటేవారిని కనిపిస్తే కాల్చివేయాలని ఉత్తర కొరియా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. తమ దేశంలో కరోనా ఇంకా అడుగుపెట్టలేదని ఉత్తర కొరియా చెబుతోంది. నార్త్ కొరియా దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యులను శిక్షించాలని ఆ దేశాన్ని డిమాండ్ చేస్తున్నామని దక్షిణ కొరియా సీనియర్ మిలటరీ అధికారి ఆన్ యంగ్ హో పేర్కొన్నారు. -
సరిహద్దు ప్రజలకు న్యాయం చేయండి
లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ వెలగపల్లి న్యూఢిల్లీ: భారత్, బంగ్లా మధ్య గల వివాదాస్పద సరిహద్దులో ఉన్న ప్రజలకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు కేంద్రాన్ని కోరారు. ఈ సరిహద్దులో ఉన్న త్రిపుర, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ పరిధిలో దాదాపు 54 వేల మంది నివసిస్తున్న ప్రాంతం రెండు దేశాలకు చెందకుండా వివాదాస్పద సరిహద్దుగా ఉంది. దీనికి తెరదించుతూ కేంద్రం భూ సరిహద్దు ఒప్పందంపై 119వ రాజ్యాంగ సవరణ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిపై చర్చలో పాల్గొన్న ఎంపీ ఈ బిల్లు కారణంగా 34 వేల మంది భారత్‌కు, 18 వేల మంది బంగ్లాదేశ్‌కు చెందేలా.. 260 ఎకరాలు బంగ్లాదేశ్‌కు, 174 ఎకరాలు భారత్‌కు వచ్చేలా చేస్తూ తెచ్చిన ఈ బిల్లును స్వాగతిస్తున్నట్టు తెలిపారు.