
టెక్నాలజీతో రైల్వేలను పరుగెత్తిస్తాం
తిరుపతి-షిర్డీ రైలును జెండాఊపి ప్రారంభిస్తున్న రైల్వే మంత్రి సురేశ్ ప్రభు
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ రైల్వేల అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. తిరుపతి నుంచి షిర్డీకి కొత్తగా ఏర్పాటు చేసిన వారాంతపు రైలును తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, రాష్ట్ర మంత్రులతో కలసి శనివారం ఆయన తిరుపతిలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. తిరుపతికి యాత్రికుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అభివృద్ధికి శ్రీకారం చుడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తలైన్లు, డబ్లింగ్-ట్రిబ్లింగ్ పనుల కోసం రూ.15,500 కోట్లు మంజూరు చేశామన్నారు. తిరుపతిలో నిర్మించనున్న మెకనైజ్డ్ ల్యాండ్రీ విభాగానికి రైల్వే మంత్రి శంకుస్థాపన చేశారు. - తిరుపతి అర్బన్