పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వమే అడ్డు
-
తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు
కోట : మండలంలోని దుగ్గరాజపట్నంలో ఓడరేవు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుంటోందని తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు ఆరోపించారు. ఆదివారం కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన చట్టంలోనే పోర్టును పొందుపరచారని, దానిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. తాను పార్లమెంట్‌లో ఈ విషయాన్ని లేవనెత్తినపుడు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే వెంటనే పోర్టు ఏర్పాటుకు సిద్ధమన్నారు. కష్ణపట్నం పోర్టు ప్రయోజనాల దష్ట్యా సీఎం చంద్రబాబునాయుడు దుగ్గరాజపట్నం పోర్టును వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రత్యేక ప్యాకేజీని సమర్ధిస్తున్న టీడీపీ నాయకులు హోదాను ఎందుకు వద్దో ప్రజలకు తెలపాలన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను ముఖ్యమంత్రి కష్ణా పుష్కరాలకు వినియోగించి దుర్వినియోగం చేశారన్నారు.
నిధులివ్వండి
స్థానిక ముస్లిం వీధిలో మహిళలు డ్రైనేజీ కాలువల కోసం నిధులు మంజూరు చేయాలని ఎంపీని కోరారు. కోట దళితవాడలో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఎంపీ పరిశీలించారు. కోట పంచాయతీకి రూ.6 లక్షలు ఎంపీ నిధులు వెచ్చించి కొత్త ట్రాక్టర్‌ను కొనుగోలు చేయగా దానిని పరిశీలించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సంపత్‌కుమార్‌రెడ్డి, యూత్ రాష్ట్ర కార్యదర్శి పల్లెమల్లు వెంకట కష్ణారెడ్డి, కోట సర్పంచ్ రాఘవయ్య, ఉపసర్పంచ్ ఇంతియాజ్, గాది భాస్కర్ పాల్గొన్నారు.