ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం | MP varaprasad infuriated the state government | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం

Published Sat, Jun 4 2016 4:30 AM | Last Updated on Thu, Aug 9 2018 4:32 PM

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం - Sakshi

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఎంపీ వరప్రసాద్

బుచ్చినాయుడుకండ్రిగ: ప్రజా సమస్యలను తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తిరుపతి ఎంపీ వరప్రసాద్ ఆరోపిం చారు. శుక్రవారం నీర్పాకోట గ్రా మంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సం యుక్త కార్యదర్శి అరణివిద్యానాథరెడ్డితో కలసి ఆయన పర్యటిం చారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మండలంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంద ని, గుక్కేడు తాగునీటి కోసం జ నం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదులపై  తెలంగాణ  ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టించుకోవటంలేదన్నారు.

దీనివల్ల రాష్ట్రంలోని పంటపొలాలు బీడు పొలాలుగా మారుతాయని తెలిపారు. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోవాలని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జలదీక్ష చేశారని గుర్తు చేశారు. ఆయనకు భా రీస్థాయిలో రైతులు మద్దతు తెలుపారన్నారు. నీర్పాకోట గ్రామం లో తాగునీటి ఓవరుహెడ్‌ట్యాం కును నిర్మిస్తానని, గ్రామంలోని సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అరణివిద్యానాథరెడ్డి,  గ్రామస్తు లు బాలాజీ, రామయ్య, మార్కొండేయులు, లక్ష్మయ్య సుబ్రమణ్యం, చిన్నయ్య, ప్రకాష్, పాండయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement