
పోర్టు కోసం పోరాటం
విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు వరంలా వచ్చిన దుగరాజపట్నం పోర్టు గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఎంపీ వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అభివృద్ధి చెందాలంటే దుగరాజపట్నం పోర్టు ఈ ప్రాంతానికి ఎంతో అవసరమన్నారు. పోర్టు నిర్మాణానికి అడ్డుపడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నామని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలు, దళితులు, మహిళలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలన్నారు.
పోర్టు నిర్మాణం, కోస్టల్ కారిడార్ ఏర్పాటు కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం చంద్రబాబు అధికార దాహంతో కలెక్టర్ల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, సీఈసీ, సీజీసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, నెల్లూరు జిల్లా యువజన అధ్యక్షుడు రూపకుమార్‌యాదవ్, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.